Health Tips: కాలు మీద కాలేసుకొని కూర్చొంటున్నారా.. డేంజర్ జోన్ లో ఉన్నట్లే..!
Health Tips: గంటల తరబడి కూర్చొని ఉద్యోగాలు చేసేవారు రిలాక్స్ కోసం కాలుమీద కాలు వేసుకొని కూర్చొంటారు.
Health Tips: గంటల తరబడి కూర్చొని ఉద్యోగాలు చేసేవారు రిలాక్స్ కోసం కాలుమీద కాలు వేసుకొని కూర్చొంటారు. ఒక్కోసారి ఇది వారికి తెలియకుండానే జరుగుతుంది. దీనివల్ల వారికి కొంచెం ఉపశమనం కలిగినట్లుగా ఉంటుంది. అందుకే తరచుగా ఈ పొజిషన్ లో కూర్చొవడానికి ఇష్టపడుతారు. కానీ ఈ పొజిషన్ లో ఎక్కువసేపు కూర్చుంటే ఆరోగ్యంపై చెడు ప్రభావం పడు తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలుమీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల పెల్విక్ ప్రాంతంలో ఎముకల అమరికలో సమస్యను పెంచుతుందట. కాళ్లకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. వెన్నుముక అమరిక దెబ్బతిని లోయర్ బ్యాక్ పెయిన్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
కాలుమీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల వెరికోస్ వెయిన్స్ సమస్య వస్తుంది. సిరల ద్వారా రక్త ప్రవాహం గుండెకు చేరుకున్నప్పుడు లేదా పంపింగ్ జరుగుతున్న రక్తప్రసరణలో సమస్య ఏర్పడితే రక్తం తిరిగి సిరల్లో ప్రవహిస్తుంది. ఇది సిరల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వీటిలో రక్తం గడ్డకట్టి శరీరంలోని అనేక భాగాలపై సిరలు ఉబ్బినట్లు కనిపిస్తాయి. అందుకే గంటల తరబడి కాలుమీద కాలు వేసుకొని కూర్చోకూడదు. దీనివల్ల రక్తసరఫరా సరిగ్గా జరగదు. కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల తొడల భాగంలో బరువు పెరుగుతుంది. కాళ్లు ఉబ్బడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. కొన్ని సందర్బాల్లో శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగక నడవలేని పరిస్థితి వస్తుంది.
ఎక్కువ సమయం కాలుమీద కాలు వేసుకుని కూర్చుంటే వెన్నునొప్పి, మోకాలి నొప్పి, పాదాలలో తిమ్మిరి వంటి సమస్యలు ఎదురవుతాయి. మనకు తెలియకుండా చేసేపని వల్ల ఇన్ని సమస్యలు దీర్ఘకాలికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. గర్బిణీలు కాలుమీద కాలు వేసుకుని కూర్చోవ డం అస్సలు మంచిది కాదు. ఈ పొజిషన్ అనేక సమస్యలకు కారణమవుతుంది. గర్భదారణ సమయంలో మహిళల శరీరాలు వేగంగా మారుతుం టాయి. కండరాల తిమ్మిరి వెన్ను నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. తల్లితోపాటు బిడ్డకు హాని కలుగుతుంది.