Relationship News: వివాహ బంధంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా.. మీరు డేంజర్ లో ఉన్నారని గుర్తించండి..!
Relationship News: భార్యాభర్తల మధ్య గొడవలు సహజం కానీ అవి ముదిరితేనే ప్రమాదం. దీనివల్ల వివాహ బంధం చెడిపోతుంది.
Relationship News: భార్యాభర్తల మధ్య గొడవలు సహజం కానీ అవి ముదిరితేనే ప్రమాదం. దీనివల్ల వివాహ బంధం చెడిపోతుంది. కొన్నిసార్లు పార్ట్‌నర్స్ అలవాట్లు ఇబ్బందిపెడుతాయి. మంచి సంబంధం అనుకున్నవారు చెడుగా మారవచ్చు చెడు సంబంధం అనుకున్నవారు మంచిగా మారవచ్చు. కానీ ఎప్పుడైతే పార్ట్‌నర్స్ ప్రవర్తన వింతగా ఉన్నా, వారి అలవాట్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా అది విషపూరిత సంబంధమని గుర్తించండి. ఈ రోజు అలాంటి రిలేషన్ షిప్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం.
మీ భాగస్వామి మీ తప్పును పదే పదే చూపి అవమానిస్తున్నా, మీతో అబద్ధాలు చెప్పినా, మిమ్మల్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నా, మీపై అసూయ పడుతున్నా అది విష సంబంధానికి సంకేతం అవుతుంది. మీరు మీ భాగస్వామికి భయపడుతున్నా, ప్రతి విషయంలోనూ ఇతరులతో పోల్చుతున్నా మిమ్మల్ని మానసికంగా బ్లాక్ మెయిల్ చేసినా అది విష సంబంధానికి సంకేతం అవుతుంది.
మీ భాగస్వామి మీపై విపరీతంగా కోపం తెచ్చుకున్నా, దూకుడుగా ప్రవర్తించినా, మీ ఈ-మెయిల్, ఫేస్‌బుక్, ఫోన్ రికార్డులను చెక్ చేసినా, అది విష సంబంధానికి సంకేతం అవుతుంది. మీరు ఒంటరిగా ఉన్నట్లు భావించినా, మీ భాగస్వామి తప్పును స్వయంగా అంగీకరించే బదులు మిమ్మల్ని నిందించినా, శారీరకంగా లేదా మానసికంగా వేధించినా అది విష సంబంధానికి సంకేతం అవుతుంది. చివరగా మీరు ఆ సంబంధంలో ఉక్కిరిబిక్కిరి అయినట్లు భావిస్తే మీ మనస్సు ఈ సంబంధం నుంచి బయటపడాలని కోరుకుంటే అది విషపూరిత సంబంధమని గుర్తించండి.