Health Tips: పచ్చి బఠానీలు ఎక్కువగా తింటున్నారా.. ఈ సమస్యలు ఉంటే జాగ్రత్త..!

Health Tips: చలికాలంలో పచ్చి బఠానీలు ఎక్కువగా లభిస్తాయి.

Update: 2023-01-26 09:59 GMT

Health Tips: పచ్చి బఠానీలు ఎక్కువగా తింటున్నారా.. ఈ సమస్యలు ఉంటే జాగ్రత్త..!

Health Tips: చలికాలంలో పచ్చి బఠానీలు ఎక్కువగా లభిస్తాయి. వీటిని బంగాళదుంపలతో కలిపి కూర వండుతారు. ఇంకా బఠాని పన్నీర్‌ లేదా బఠాని పరటాలు చేసుకుని తింటారు. వాస్తవానికి పచ్చి బఠానీలు తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. అయితే అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర హాని జరుగుతుంది. ఈ రోజు పచ్చి బఠానీలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందా.

అజీర్తి సమస్య

గ్యాస్ లేదా ఎసిడిటీతో సమస్యతో ఇబ్బందిపడే వ్యక్తులు పచ్చి బఠానీలను తక్కువగా తినాలి. ఎందుకంటే వారికి ఇవి జీర్ణం అవడం చాలా కష్టం.

కిడ్నీ సమస్యలు

పచ్చి బఠానీలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల పనితీరుకు ఆటంకం కలుగుతుంది. అందుకే పచ్చి బఠానీలు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

అధిక బరువు

పచ్చి బఠానీలు అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరగడం ప్రారంభమవుతుంది. బరువు తగ్గాలనుకునే వారు పచ్చి బఠానీలకి దూరంగా ఉండాలి.

యూరిక్ యాసిడ్‌ సమస్య

పచ్చి బఠానీలలో ప్రోటీన్లు, అమైనో యాసిడ్‌లు, విటమిన్ డి పెద్ద మొత్తంలో లభిస్తాయి. ఇవి శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ని ప్రేరేపించడానికి పని చేస్తాయి. అందువల్ల అధిక యూరిక్ యాసిడ్ సమస్యలో పచ్చి బఠానీలను తీసుకోవద్దు. 

Tags:    

Similar News