Eating Kharbuja: వేసవిలో కర్భుజ తింటున్నారా.. ఈ విషయాలు తెలిస్తే అస్సలు వదలరు..!

Eating Kharbuja: వేసవి వచ్చేసింది వేడిని తెచ్చేసింది. పగలంత వేడిగా రాత్రి మొత్తం ఉక్కపోతగా ఉంటుంది. ఈ సీజన్‌లో చాలామంది ద్రవ పదార్థాలను తినడానికి మొగ్గుచూపుతారు.

Update: 2024-03-07 15:00 GMT

Eating Kharbuja: వేసవిలో కర్భుజ తింటున్నారా.. ఈ విషయాలు తెలిస్తే అస్సలు వదలరు..!

Eating Kharbuja: వేసవి వచ్చేసింది వేడిని తెచ్చేసింది. పగలంత వేడిగా రాత్రి మొత్తం ఉక్కపోతగా ఉంటుంది. ఈ సీజన్‌లో చాలామంది ద్రవ పదార్థాలను తినడానికి మొగ్గుచూపుతారు. ఎందుకంటే బాడీ తరచుగా డీ హైడ్రేషన్‌కు గురవుతుంది. దాహం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో పుచ్చకాయం, కర్భుజ పండ్లు ఎక్కువగా తింటారు. ఈ రోజు మనం కర్భుజ పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

అధిక పోషకాలు

కర్భుజ పండులో ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మం కోసం రోగనిరోధక పనితీరు, కొల్లాజెన్ ఉత్పత్తికి సపోర్ట్‌ చేస్తుంది. కర్బూజా లో విటమిన్ K, పొటాషియం, B విటమిన్లు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యం, ఎలక్ట్రోలైట్ సమతుల్యత, జీవక్రియకు సహాయపడతాయి.

అధిక నీటి కంటెంట్‌

కర్భుజలో అధిక నీటి కంటెంట్ ఉంటుంది. వేసవిలో కర్బూజ హైడ్రేటెడ్‌గా ఉండటానికి ఒక అద్భుతమైన ఎంపిక. ఉష్ణోగ్రత నియంత్రణ, జీర్ణక్రియ, పోషకాల రవాణాతో సహా వివిధ శారీరక విధులకు ముఖ్యమైనది.

యాంటీఆక్సిడెంట్ పుష్కలం

కర్భుజ కెరోటిన్, లుటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేయడంలో సహాయపడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు మంటను తగ్గించడంలో, కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్‌లతో సహా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

జీర్ణ ఆరోగ్యం

కర్భుజలో ఉండే ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను, సాధారణ పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. అంతేకాకుండా ఫ్రక్టోజ్ వంటి కర్బూజాలోని సహజ చక్కెరలు సులభంగా జీర్ణమవుతాయి.

బరువు

కర్భుజ తీపి రుచి ఉన్నప్పటికీ తక్కువ కేలరీలు ఉంటాయి. ఇందులో కొవ్వు ఉండదు. ఇందులో అధిక నీరు, ఫైబర్ కంటెంట్ కడుపునిండిన ఫీలింగ్ ఇస్తుంది. అతిగా తినడాన్ని తగ్గిస్తుంది.

Tags:    

Similar News