Health Tips: బ్రేక్ ఫాస్ట్‌లో యాపిల్‌ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

Health Tips: ప్రతిరోజు యాపిల్‌ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

Update: 2023-05-28 02:30 GMT

Health Tips: బ్రేక్ ఫాస్ట్‌లో యాపిల్‌ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

Health Tips: ప్రతిరోజు యాపిల్‌ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఒకరోజులో మనిషికి కావాల్సిన పోషకాలన్నింటిని యాపిల్‌ అందిస్తుంది. అందుకే ప్రతిఒక్కరు దీనిని డైట్‌లో చేర్చుకోవాలి. ఉదయంపూట బ్రేక్‌ఫాస్ట్‌గా యాపిల్‌ తింటే చాలా మంచిది. కానీ నేటిరోజుల్లో చాలామంది నూనెతో తయారుచేసిన తినుబండారాలని తీసుకుంటారు. ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఉదయం ఆపిల్ తినడం ఎందుకు ప్రయోజనకరంగా ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం.

చెడు కొలెస్ట్రాల్‌కి చెక్

యాపిల్‌ కరోనరీ ఆర్టరీ వ్యాధికి కారణమైన ధమనులు మూసుకుపోకుండా నిరోధిస్తుంది. యాపిల్ తొక్కలో ఫినోలిక్ సమ్మేళనం ఉంటుంది. దీనివల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోదు. గుండె జబ్బుల నుంచి రక్షించబడతారు.

స్ట్రోక్ నివారణ

ఆపిల్ తినడం వల్ల స్ట్రోక్, డయాబెటిస్ రిస్క్ చాలా వరకు తగ్గుతుందని చాలా పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు యాపిల్‌ తినడం ఉత్తమం.

శక్తిని పెంచుతుంది

ఉదయంపూట వ్యాయామం పూర్తి చేయగానే బ్రేక్‌ఫాస్ట్‌లో యాపిల్‌ను తీసుకోవాలి. దీనివల్ల మీరు కోల్పోయిన పోషకాలన్ని శరీరానికి అందుతాయి. రోజు మొత్తం ఎనర్జిటిక్‌గా ఉంటారు.

బరువు తగ్గుతారు

ఈ రోజుల్లో అధిక బరువు అతి పెద్ద సమస్య. ఊబకాయం అనేక వ్యాధులకు మూలం. బరువును కంట్రోల్ చేయాలంటే బ్రేక్‌ఫాస్ట్‌లో ఖచ్చితంగా ఆపిల్ తినాలి. ఎందుకంటే ఈ పండులో అతితక్కువ కొవ్వు ఉంటుంది. ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

Tags:    

Similar News