Buying New Fridge: కొత్తగా ఫ్రిజ్ కొంటున్నారా.. మీ ఫ్యామిలీకి ఎలాంటి ఫ్రిజ్ సెట్ అవుతుందో తెలుసుకోండి..!
Buying New Fridge: కొత్తగా ఫ్రిడ్జ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా అయితే ముందుగా మీ ఫ్యామిలీకి ఎలాంటి ఫ్రిడ్జ్ అయితే బాగుంటుందో ఐడియా ఉండాలి.
Buying New Fridge: కొత్తగా ఫ్రిడ్జ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా అయితే ముందుగా మీ ఫ్యామిలీకి ఎలాంటి ఫ్రిడ్జ్ అయితే బాగుంటుందో ఐడియా ఉండాలి. అంటే మీ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారు వారిని బట్టి మీకు సింగిల్ డోర్, డబుల్ డోర్, త్రిబుల్ డోర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ లేని ఇల్లును ఊహించుకోవడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఫ్రిడ్జ్‌ని చాలా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. మార్కెట్‌లో రకరకాల ఫ్రిడ్జిలు లభిస్తున్నాయి. వాటిలో బెస్ట్ ఫ్రిడ్జి తీసుకోవడం ఎలాగో ఈ రోజు తెలుసుకుందాం.
సింగిల్ డోర్ ఫ్రిజ్ 160 లీటర్ల నుంచి 210 లీటర్ల కెపాసిటీ కలిగి ఉంటుంది. ఒకే డోర్ ఫ్రిజ్‌లో ఒక బాక్స్ మాత్రమే ఉంటుంది. అలాగే తెరవడానికి ఒకే డోర్ ఉంటుంది. పైన డీప్ ఫ్రీజర్ ఉంటుంది. ఒక ఫ్యామిలీలో ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు ఉంటే సింగిల్ డోర్ ఫ్రిజ్ బెస్ట్ అప్షన్‌అవుతుంది. ఇది చౌకగా లభిస్తుంది. ఇంట్లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించదు. విద్యుత్ వినియోగం కూడా తక్కువే ఉంటుంది.
డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు 220 లీటర్ల నుంచి 500 లీటర్ల కెపాసిటీ కలిగి ఉంటుంది. దీనికి రెండు డోర్లు ఉంటాయి. ఇందులో మొదటిది కూరగాయలు, ఫుడ్స్ పెట్టుకోవడానికి ఫ్రీజర్ ఉంటుంది. ఇవి ఎక్కువ ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. మీరు చాలా రోజుల పాటు ఆహారాన్ని స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇందులో ఎక్కువ ప్లేస్ ఉంటుంది. మీ కుటుంబంలో 4 నుంచి 5 గురు ఉంటే డబుల్ డోర్ ఫ్రిజ్ సెట్ అవుతుంది.
ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ 250 లీటర్ల నుంచి 500 లీటర్ల కెపాసిటీ కలిగి ఉంటాయి. వీటికి మూడు డోర్లు ఉంటాయి. డీప్ ఫ్రీజర్ ఉన్న పై డోర్‌లో ఆహారం, కూరగాయలు, ఇతర ఫుడ్ ఐటమ్స్‌ను మిడిల్ బాక్స్ లో స్టోర్ చేస్తారు. ఇందులో చాలా ప్లేస్ ఉంటుంది. మీ ఫ్యామిలీలో ఏడెనిమిది మంది ఉంటే ట్రిపుల్ డోర్ తీసుకోవచ్చు. అయితే మిగతా రెండు ఫ్రిడ్జిలతో పోలిస్తే దీని ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.