మొక్కజొన్న కంకిని కాల్చుకొని తింటున్నారా.. అయితే ఈ ప్రయోజనాలని మిస్సవుతున్నట్లే..!

Corn Benefits: మొక్కజొన్న కంకి ఒక దేశీ ఫుడ్‌. దీని రుచి అందరిని ఆకర్షిస్తుంది.

Update: 2023-04-05 15:00 GMT

మొక్కజొన్న కంకిని కాల్చుకొని తింటున్నారా.. అయితే ఈ ప్రయోజనాలని మిస్సవుతున్నట్లే..!

Corn Benefits: మొక్కజొన్న కంకి ఒక దేశీ ఫుడ్‌. దీని రుచి అందరిని ఆకర్షిస్తుంది. ఇండియాలో దీనిని నిప్పులో కాల్చుకొని తింటారు. అయితే మారుతున్న కాలంలో ఉడకబెట్టిన తర్వాత తినే ట్రెండ్ బాగా పెరిగింది. మొక్కజొన్న గింజలలో ఫైబర్, విటమిన్ సి, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్ని ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చాలా మంది ఆరోగ్య నిపుణులు వీటిని క్రమం తప్పకుండా తినాలని సూచిస్తారు. కానీ మొక్కజొన్నకంకి కాల్చేటప్పుడు దాని జుట్టును డస్ట్‌బిన్‌లో పడేస్తారు. కానీ ఈ జుట్టులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కంకిని కాల్చుకొని తినడం వల్ల దీని ప్రయోజనాన్ని పొందలేరు.

1. అధిక కొలస్ట్రాల్

ప్రస్తుత కాలంలో కొలెస్ట్రాల్ ప్రధాన సమస్యగా మారింది. దీన్ని సకాలంలో నియంత్రించడం అవసరం. లేదంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ పరిస్థితిలో మొక్కజొన్న ఫైబర్స్ తీసుకోవడం వల్ల రక్త నాళాలలో ఉన్న కొలెస్ట్రాల్ బయటకు వస్తుంది.

2. మధుమేహం

మధుమేహంతో బాధపడుతున్న వారికి మొక్కజొన్న వరం కంటే తక్కువేమి కాదు. ఇందులో మధుమేహాన్ని నియంత్రించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి పనిచేస్తాయి.

3. రోగనిరోధక శక్తి

కరోనా కాలం నుంచి రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి అందరు దృష్టి సారించారు. మొక్కజొన్న తినడం వల్ల ఇన్ఫెక్షన్ నివారించవచ్చు. ఇందులో ఫైబర్‌, విటమిన్ సి ఉంటుంది కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

4. జీర్ణక్రియ

కడుపు నొప్పికి సంబంధించిన సమస్యలు ఉన్నవారికి కంకి జుట్టు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియలో పనిచేస్తుంది.

5. గర్భిణీలు

గర్భీణీలు తప్పనిసరిగా కంకితో పాటు దాని హెయిర్‌ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది వారికి కడుపులో ఉన్న బిడ్డకు ప్రయోజనకరంగా ఉంటుంది.

Tags:    

Similar News