Bed Bugs: బెడ్‌పై నల్లుల బెడద ఎక్కువైందా.. ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారా..!

Bed Bugs: పొద్దంతా ఆఫీసులో డ్యూటీ చేసివచ్చి రాత్రి ప్రశాంతంగా పడుకుందామనుకుంటే బెడ్పై నల్లులు ఉన్నాయనుకో ఆ పరిస్థితి పగోడికి కూడా రావొద్దనుకుంటారు చాలామంది.

Update: 2024-05-30 15:00 GMT

Bed Bugs: బెడ్‌పై నల్లుల బెడద ఎక్కువైందా.. ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారా..!

 Bed Bugs: పొద్దంతా ఆఫీసులో డ్యూటీ చేసివచ్చి రాత్రి ప్రశాంతంగా పడుకుందామనుకుంటే బెడ్పై నల్లులు ఉన్నాయనుకో ఆ పరిస్థితి పగోడికి కూడా రావొద్దనుకుంటారు చాలామంది. ఎందుకంటే నల్లులు మనుషులను నిద్రపోనివ్వవు. బాడీలోని రక్తాన్ని పీల్చివేస్తాయి. వీటివల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నల్లులు ఇంటిని మురికిగా చేస్తూ చెడు వాసనను వెదజల్లుతాయి. ఇల్లు మొత్తం కంపుకొడుతుంది. అయితే కొన్ని చిట్కాలను పాటించి నల్లుల బాధ నుంచి తప్పించుకోవచ్చు. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

మంచం పూర్తిగా శుభ్రం చేయాలి

నల్లులను వదిలించుకోవాలంటే ముందుగా మంచం మొత్తం క్లీన్ చేయాలి. బెడ్ షీట్లు, దిండు కవర్లు, ఇతర పరుపు వస్తువులను వేడి నీటిలో ఉతకాలి. తర్వాత వాటిని అధిక ఉష్ణోగ్రత వద్ద డ్రైయర్‌లో ఆరబెట్టాలి. అలాగే పరుపు, సోఫా, ఇతర ఫర్నిచర్‌ను వాక్యూమ్ క్లీనర్‌తో పూర్తిగా క్లీన్ చేయాలి. వాక్యూమ్ బ్యాగ్‌ను వెంటనే బయట విసిరివేయాలి. తద్వారా నల్లులు తిరిగి ఇంట్లోకి రాలేవు.

స్టీమ్ క్లీనింగ్

నల్లులను చంపడానికి స్టీమ్ క్లీనింగ్ ప్రభావవంతమైన మార్గం. వాటి గుడ్లు అధిక ఉష్ణోగ్రతల వద్ద జీవించలేవు. కాబట్టి ఆవిరి క్లీనర్ ఉపయోగించాలి. పరుపు, సోఫా, కార్పెట్, ఇతర ప్రభావిత ప్రాంతాల్లో ఆవిరి క్లీనర్‌లతో క్లీన్ చేయాలి. ఈ పద్ధతి నల్లులు, వాటి గుడ్లను చంపడంలో బాగా పనిచేస్తుంది.

సహజ వస్తువుల ఉపయోగం

వేప నూనె, లావెండర్ ఆయిల్ నల్లులను వదిలించుకోవడానికి సహజ ఎంపికలుగా పనిచేస్తాయి. వేప నూనె నల్లులను చంపే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. లావెండర్ ఆయిల్ వాటి సున్నితత్వాన్ని తగ్గిస్తుంది. ఈ నూనెలను నీటిలో కలిపి స్ప్రే బాటిల్‌లో వేసి ప్రభావిత ప్రాంతాల్లో పిచికారీ చేయాలి. ఈ రెమెడీ నల్లులను వదిలించుకోవడమే కాకుండా మీ ఇంటికి తాజాదనాన్ని అందిస్తుంది.

డయాటోమాసియస్ ఎర్త్

డయాటోమాసియస్ ఎర్త్ అనేది ఒక సహజమైన పొడి. ఇది నల్లులు, ఇతర కీటకాలను చంపడానికి ఉపయోగపడుతుంది. ఈ పౌడర్ నల్లుల ఎక్సోస్కెలిటన్‌ను నాశనం చేస్తుంది, దీనివల్ల అవి డీ హైడ్రేషన్కు గురై చనిపోతాయి. ఈ పొడిని పరుపు, కార్పెట్, ఇతర ప్రభావిత ప్రాంతాలపై చల్లి కొంత సమయం తర్వాత వాక్యూమ్ క్లీనర్‌తో క్లీన్ చేయాలి.

Tags:    

Similar News