Beauty Tips: చర్మం కోసం మందార పువ్వు.. ఇలా వాడితే సహజమైన మెరుపు మీ సొంతం..!
Beauty Tips: గ్రామాల్లో మందార పువ్వులకు కొదవలేదు. దాదాపు ప్రతి ఇంటి పెరడులో మందార చెట్టు ఉంటుంది.
Beauty Tips: గ్రామాల్లో మందార పువ్వులకు కొదవలేదు. దాదాపు ప్రతి ఇంటి పెరడులో మందార చెట్టు ఉంటుంది. ఈ పువ్వు చూడటానికి ఎర్రగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇందులో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉంటాయి. పూర్వకాలం నుంచి ఈ చెట్టు పువ్వులను, ఆకులను ఆయుర్వేదంలో వినియోగించేవారు. మందార పువ్వును దేవుడి పూజలో కూడా ఉపయోగిస్తారు. ఈ పువ్వు జుట్టు, చర్మానికి చాలా మేలు చేస్తుంది.
అందమైన చర్మం కోసం దీన్ని చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. ఇది ముఖంపై సహజమైన మెరుపును తెస్తుంది. మందార పువ్వుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి. మందార పువ్వులను ఉపయోగించి అనేక ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. ఇవి చర్మ రంధ్రాలను తెరుస్తాయి. చర్మంపై ఉండే మచ్చలను తొలగిస్తాయి. UV కిరణాల నుంచి కాపాడుతాయి. మందార పువ్వును చర్మానికి ఏయే మార్గాల్లో ఉపయోగించవచ్చో ఈ రోజు తెలుసుకుందాం.
మందార పువ్వుల సింపుల్ ప్యాక్
ఇందుకోసం ఒక గిన్నెలో 2 స్పూన్ల మందార పూల పొడిని తీసుకోవాలి. కొన్ని నీళ్లు కలపాలి. పేస్టులా చేసి ముఖం, మెడపై అప్లై చేయాలి. 20 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత సాధారణ నీటితో కడగాలి. మీరు ఈ ప్యాక్‌ని వారానికి 2 నుంచి 3 సార్లు ఉపయోగించవచ్చు.
పచ్చి పాలు, మందార పూల పేస్ట్
ఈ పేస్ట్ చేయడానికి 2 స్పూన్ల మందార పూల పొడిని తీసుకోవాలి. అవసరాన్ని బట్టి పాలు కలపాలి. ఈ పేస్ట్‌ను చర్మంపై 10 నిమిషాల పాటు రుద్దాలి. తరువాత సాధారణ నీటితో చర్మాన్ని శుభ్రం చేయాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి 2 లేదా 3 సార్లు ఉపయోగించవచ్చు.
మందార పువ్వు, గ్రీన్ టీ ప్యాక్
కొన్ని మందార పువ్వులను ఆరబెట్టి పొడి తయారుచేసుకోవాలి. ఇప్పుడు మందార పొడిలో 2 స్పూన్ల గ్రీన్ టీ కలపాలి. ఈ ప్యాక్‌ని మెడ, ముఖానికి ఇరవై నిమిషాల పాటు అప్లై చేయాలి. ఈ ప్యాక్‌ని వారానికి రెండుసార్లు ఉపయోగించడం వల్ల ముఖంలోని మచ్చలు తొలగిపోతాయి.
మందార పువ్వులు, అలోవెరా ప్యాక్
2 టీస్పూన్ల మందార పొడిలో అలోవెరా జెల్ కలపాలి. ఈ ప్యాక్‌ను చర్మంపై 15 నిమిషాల పాటు అప్లై చేయాలి. తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. కలబంద, మందార పువ్వుల ప్యాక్‌ని వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు. ఈ ప్యాక్ మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.