Skin Care Tips: శెనగపిండితో ఈ చర్మ సమస్యలకి చెక్..!

Skin Care Tips: శెనగపిండితో ఈ చర్మ సమస్యలకి చెక్..!

Update: 2022-10-21 08:32 GMT

Skin Care Tips: శెనగపిండితో ఈ చర్మ సమస్యలకి చెక్..!

Skin Care Tips: భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి చర్మాన్ని శుభ్రం చేయడానికి శెనగపిండిని వాడుతున్నారు. ఈ పిండి కొంచెం ముతకగా ఉంటుంది. కాబట్టి చర్మంలోకి లోతుగా వెళ్లి శుభ్రపరుస్తుంది. అంతేకాదు ఏదైనా చర్మ వ్యాధి ఉన్నట్లయితే శనగ పిండిని ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. వర్షాకాలంలో చర్మం జిడ్డుగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో శెనగపిండితో చర్మాన్ని శుభ్రం చేసుకోవచ్చు. శనగపిండిని ముఖానికి రాసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

మొటిమలు దూరం

శనగపిండిని ముఖానికి రాసుకుంటే మొటిమల సమస్య తొలగిపోతుంది. ఇది చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది.

మృతకణాలను తొలగిస్తుంది

శనగపిండిని ముఖానికి పట్టించడం వల్ల ముఖం శుభ్రంగా మారుతుంది. శనగపిండిలో ఉండే ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్లు చర్మంపై ఉన్న మృత చర్మాన్ని తొలగించడంలో సహాయపడతాయి. చర్మం రంగు కాంతివంతంగా ఉంటుంది. అంతే కాకుండా ప్రతిరోజూ ముఖాన్ని కడుక్కోవడం వల్ల ముఖం మెరుస్తుంది.

Tags:    

Similar News