Apples vs oranges: యాపిల్స్ vs ఆరేంజ్ ఎందులో పోషకాలు ఎక్కువ.. ఏది ఆరోగ్యానికి మంచిది
Apples vs. oranges:
Apples vs oranges:నేటికాలంలో అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. నేటి బిజీలైఫ్ కారణంగా చాలా మంది తినడానికి సమయం కేటాయించడం లేదు. ఇక సమతుల్య ఆహారం అంటే ఏంటి అనే పరిస్థితి నెలకొంది. దీంతో వ్యాధులు బారిన పడుతున్నారు. అయితే ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఎప్పుడైనా పండ్లు తినమని వైద్యులు సూచిస్తుంటారు. ఎందుకంటే పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంటాయి. అందులో ముఖ్యంగా యాపిల్స్. రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇక నారింజ విటమిస్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మరీ ఈ రెండు పండ్లలో ఎందులో ఎక్కువ పోషకాలు ఉన్నాయి. ఈ రెండింటిలో ఏ పండు ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
యాపిల్, నారింజ రెండూ కూడా రోగనిరోధశక్తిని పెంచడంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంచుతాయి. నారింజలో విటమిన్ సి, యాపిల్స్ లో క్వెర్సెటిన్ అనే విభిన్న పోషకాలు ఉన్నాయి. ఇవి మన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే న్యూయార్క్ చెందిన ప్రివెంటివ్ కార్డియాలజీ డైటీషియన్ లో ప్రచురించిన ఓ కథనం ప్రకారం..నారింజ వర్సెస్ యాపిల్ రెండింటిలో ఏది మంచిదనే విషయాన్ని వెల్లడించారు. అయితే ప్రతి పండు ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఈ రెండు పండ్లు కూడా భిన్నమైన రుచులను కలిగి ఉంటాయి. ఈ రెండు పండ్లు కూడా తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. రౌథెన్ స్టెయిన్ లో హైలెట్ చేసినట్లు 182 గ్రాముల బరువున్న యాపిల్ పండులో 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 4.4 గ్రాముల ఫైబర్, 95 కేలరీలు, 1 గ్రాము కంటే తక్కువ ప్రోటీన్,కొవ్వు ఉంటాయి. రోజుకో యాపిల్ 14శాతం విటమిన్ సి మన శరీరానికి అందుతుంది. యాపిల్ఎక్కువగా తినేవారికి క్వెర్సెటిన్ అనే పోషకం పుష్కలంగా అందుతుంది. యాపిల్ తింటే అందులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు గుండె ఆరోగ్యం, రోగనిరోధక పనితీరు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి వాటికి చెక్ పెడుతుందని నిపుణులు పేర్కొన్నారు.
యాపిల్స్ వలే నారింజలో కూడా అద్బుతమైన పోషకాలు ఉన్నాయి. ఒక నారింజ 66 కేలరీలు, 86శాతం నీటి కంటెంట్, 1.3 గ్రాముల ప్రోటీన్, 14.8 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 12 గ్రాముల చక్కెర, 2.8 గ్రాముల ఫైబర్, 0.2 గ్రాముల కొవ్వు ఉంటుంది. రోజుకో ఆరేంజ్ తింటే 92శాతం విటమిన్ సిను అందిస్తుంది.రోజువారీ డైట్లో నారింజను చేర్చుకుంటే విటమిన్ సి తోపాటు ఎ కూడా శరీరానికి అందుతుంది. విటమిన్ ఎ, సితోపాటు ఇతర విటమిన్లు, ఖనిజాలు, ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ వంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. నారింజ వంటి సిట్రస్ పండ్లను క్రమం తప్పకుండా మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం, రక్తపోటు తగ్గడం, రోగనిరోధక వ్యవస్థకు కాపాడుతుందని అధ్యయనం పేర్కొంది.
యాపిల్, నారింజ ఏది ఆరోగ్యకరమైంది?
యాపిల్, నారింజ రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వేటి ప్రయోజనాలు వాటికే ఉన్నాయి. మనం డైట్లో ఈ రెండింటిని చేర్చుకోవచ్చని అధ్యయనం చెబుతోంది. ఇందులో సహజ చక్కెరలు ఉంటాయి కాబట్టి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు, మూత్రపిండాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వెల్లడించారు.