Antibiotics Side Effects: పిల్లలకు యాంటీ బయాటిక్స్ ఇస్తున్నారా.. సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి..!
Antibiotics Side Effects: చలికాలంలో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో ఇమ్యూనిటీ శక్తి తగ్గుతుంది. దీంతో తరుచుగా జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లు, ఫ్లూ లాంటి సీజనల్ వ్యాధులు వస్తుంటాయి.
Antibiotics Side Effects: చలికాలంలో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో ఇమ్యూనిటీ శక్తి తగ్గుతుంది. దీంతో తరుచుగా జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లు, ఫ్లూ లాంటి సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. దీంతో తల్లిదండ్రులు చాలామంది యాంటీబయాటిక్స్‌పై ఆధారపడుతారు. ఇవి పిల్లల వ్యాధులను తగ్గించినప్పటికీ వీటివల్ల చాలా దుష్ప్రభాలు ఉంటాయి. ముఖ్యంగా పిల్లల విషయంలో ఇవి చాలా ప్రమాదకరం. యాంటీ బయాటిక్స్ సైడ్‌ఎఫెక్ట్స్ గురించి ఈ రోజు తెలుసుకుందాం.
వైద్య సలహా లేకుండా పిల్లలకు పదే పదే యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల పిల్లల ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల వారి శరీరంలో ఉండే మంచి బాక్టీరియా నశిస్తుంది. దీంతో పిల్లలు అనేక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. పిల్లలకు యాంటీబయాటిక్ ఎక్కువగా ఇచ్చినట్లయితే అతను యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే మందులు వేసుకున్నతర్వాత ఆ ఔషధం శరీరంపై ప్రభావం చూపదు. దీనిని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు. ఈ పరిస్థితిలో పిల్లవాడు అనారోగ్యానికి గురైనప్పుడు అతడి శరీరంపై మందులు ప్రభావం చూపవు. అప్పుడు వారి ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడుతుంది.
యాంటీబయాటిక్స్ పిల్లల జీర్ణవ్యవస్థపై నెగిటివ్ ప్రభావాన్ని చూపుతాయి. ఈ మందుల వల్ల పిల్లల శరీరం పోషకాలను సరిగా జీర్ణం చేసుకోలేక ఎదుగుదల ఆగిపోతుంది. చాలా యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల పిల్లల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని కారణంగా ఇన్ఫెక్షన్ సోకి త్వరగా అనారోగ్యానికి గురవుతాడు. పిల్లలకు ఎక్కువ యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల పిల్లల కడుపుపై చెడు ప్రభావం పడుతుంది. ఇది విరేచనాలకు దారితీస్తుంది. ఇలాంటి మందులు తీసుకోవడం వల్ల కడుపులో ఎసిడిటీ వంటి సమస్యలు ఎదురవుతాయి. వైద్య సలహాపై మాత్రమే పిల్లలకి యాంటీబయాటిక్స్ ఇవ్వాలి.