Amla Benefits For Hair: జుట్టు విపరీతంగా రాలిపోతుందా? అయితే ఉసిరితో అన్ని సమస్యలూ పరార్
Amla Benefits For Hair: మీ జుట్టు విపరీతంగా రాలిపోతుందా. చుండ్రు, వెంట్రుకలు చిట్లిపోవడం వంటి సమస్యలు ఎదుర్కుంటున్నారా. అయితే ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అవేంటో చూద్దాం.
Amla Benefits For Hair: నేటికాలంలో వాతావరణ కాలుష్యం, సమతుల్య ఆహారం తీసుకోకపోవడం వల్ల చాలా మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు జుట్టు రాలుతుందన్న కంప్లెయింట్స్ చేస్తున్నారు. అయితే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఉసిరికాయతో జుట్టు రాలే సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఎందుకంటే ఉసిరి డైట్లో చేర్చుకుంటే కేశారోగ్యం కూడా బాగుంటుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం జుట్టు రాలే సమస్యకు ఉసిరి దివ్యౌషధంలా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు నెరవకుండా, చుండ్రు దరి చేరకుండా కాపాడుతుంది. అంతేకాదు జుట్టుకు నేచురల్ కండిషనర్ గా పనిచేస్తుంది. దీంతో జుట్టు సిల్కీగా, స్మూత్ గా మారుతుంది.
ఉసిరి జ్యూస్ తీసుకుంటే..
ఉసిరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో నుంచి రసం పిండుకోవాలి. దానిని వడకట్టి కేవలం ఉసిరి రసాన్ని మాత్రమే ఫిల్టర్ చేసుకోవాలి. అందులో కొంచెం నీళ్లు కలిపి తలకు పట్టించుకోవాలి. ఇలారోజు చేస్తే వెంట్రుకలు కుదుళ్ల నుంచి బలంగా మారుతాయి. జుట్టు పెరుగుతుంది.
ఉసిరి నూనె :
జుట్టు పెరగాలన్నా..ఒత్తుగా ఉండాలన్నా ఉసిరి నూనె బెస్ట్ ఛాయిస్. విటమిన్ సితోపాటు పోషకాలు, అమినో యాసిడ్స్, ఫైటోన్యూట్రియంట్లు జుట్టును బలంగా ఉంచుతాయి. ఇతర చికిత్సలు అవసరం లేకుండా జుట్టుకు అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని తలకు రోజు పట్టిస్తే స్మూత్, స్ట్రాంగ్, షైనీ జట్టు మీ సొంతం అవుతుంది.
ఉసిరి ,నిమ్మ మాస్క్:
జుట్టకు జీవం లేకుంటే కాంతిహీనంగా మారుతుంది. కానీ జుట్టుకు జీవం పోసే గుణం నిమ్మకాయలో ఉంది. జుట్టును శుభ్రం చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది. నిమ్మకాయలో, ఉసిరిలో ఉండే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది. ఉసిరి, నిమ్మకాయ కలిపి వాడితే జుట్టుకు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటుంది. చుండ్రు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు రాకుండా ఉండేందుకు కాపాడుతుంది. కుదుళ్లలో దురదను రానివ్వదు.
ఉసిరి -పెరుగు:
ఉసిరితో పాటు పెరుగు జుట్టు ఎదిగేందుకు తోడ్పడుతాయి. పెరుగు పాడైపోయిన వెంట్రుకలను రిపైర్ చేస్తుంది. పొడి జుట్టును తిరిగి మామూలు స్థితికి తీసుకువస్తుంది.