Black Turmeric: నల్ల పసుపులో అద్భుత ఔషధ గుణాలు.. ఈ ఆరోగ్య సమస్యలకి చక్కటి పరిష్కారం..!

Black Turmeric: భారతదేశంలో పసుపుని పూర్వకాలం నుంచి ఉపయోగిస్తున్నారు. దీనిని ఎక్కువగా వంటకాలలో ఉపయోగిస్తారు.

Update: 2023-06-14 04:33 GMT

Black Turmeric: నల్ల పసుపులో అద్భుత ఔషధ గుణాలు.. ఈ ఆరోగ్య సమస్యలకి చక్కటి పరిష్కారం..!

Black Turmeric: భారతదేశంలో పసుపుని పూర్వకాలం నుంచి ఉపయోగిస్తున్నారు. దీనిని ఎక్కువగా వంటకాలలో ఉపయోగిస్తారు. దీనివల్ల వంటకాలకి ప్రత్యేక రుచి వస్తుంది. భారతీయులు ఇది లేనిదే దాదాపు ఏ వంటకం తయారుచేయలేరు. అయితే పసుపులో 2 రకాలు ఉంటాయి. ఇందులో నల్లపసుపు కూడా ఒకటి ఉంటుంది. దీనిలో అద్భుత ఆయుర్వేద గుణాలు ఉంటాయి. మందుల తయారీలో దీనిని వాడుతారు. దీనిని ప్రధానంగా భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో పండిస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చర్మానికి ఔషధం కంటే తక్కువేమి కాదు. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

1. గాయాలు మానుతాయి

శరీరంపై గాయలు అయినప్పుడు చాలామంది రకరకాల మందులు, క్రీమ్‌లని ఉపయోగిస్తారు. కానీ వాటన్నిటికంటే నల్లపసుపు బాగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేద చికిత్స కావాలంటే గాయం ప్రభావిత ప్రాంతంలో నల్ల పసుపు పేస్ట్‌ను అప్లై చేయాలి. దీనివల్ల గాయాలు త్వరగా మానిపోతాయి.

2. మెరుగైన జీర్ణక్రియ

నల్ల పసుపు కడుపు సమస్యలకు దివ్యౌషధంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎవరికైనా కడుపు నొప్పి లేదా గ్యాస్ సమస్య ఉంటే ఈ మసాలా బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం నల్ల పసుపు పొడిని సిద్ధం చేసి నీటిలో కలుపుకుని తాగాలి.

3. చర్మానికి మేలు

సాధారణ పసుపులాగే నల్ల పసుపు కూడా చర్మానికి మేలు చేస్తుంది. దీనిని తేనెతో కలిపి ముఖానికి రాసుకుంటే విపరీతమైన గ్లో వస్తుంది. ఇది కాకుండా ముఖం నల్ల మచ్చలు, మొటిమలను కూడా తొలగిస్తుంది.

4. కీళ్ల నొప్పుల ఉపశమనం

వయసు పెరిగే కొద్దీ కీళ్ల నొప్పులు రావడం సర్వసాధారణం. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్న నల్ల పసుపును పేస్ట్ చేసి ప్రభావిత ప్రాంతాలకు రాస్తే వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది.

Tags:    

Similar News