రావిచెట్టులో అద్భుత ఆయుర్వేద గుణాలు.. ఈ ఆరోగ్య సమస్యలకి చక్కటి మందు..!

Peepal Tree Benefits: రావిచెట్టుకి గొప్ప చరిత్ర ఉంది. దీని ఆకులు, బెరడులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.

Update: 2022-11-13 15:22 GMT

రావిచెట్టులో అద్భుత ఆయుర్వేద గుణాలు.. ఈ ఆరోగ్య సమస్యలకి చక్కటి మందు..!

Peepal Tree Benefits: రావిచెట్టుకి గొప్ప చరిత్ర ఉంది. దీని ఆకులు, బెరడులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. రావిచెట్టు అతి ఎక్కువగా ఆక్సిజన్ ఇచ్చే చెట్టు. ఆయుర్వేదం ప్రకారం రావిచెట్టు ద్వారా అనేక వ్యాధులను నయం చేయవచ్చు. ఈ చెట్టులో ఉన్న గుణాలు శ్వాస, దద్దుర్లు, జలుబు, దురద, ముక్కు నుంచి రక్తం కారడం వంటి సమస్యలను నయం చేయవచ్చు. రావిచెట్టు ప్రయోజనాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

శ్వాసకోశ సమస్యలు

రావిచెట్టు బెరడు శ్వాసకోశ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఊపిరితిత్తులను బలోపేతం చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. రావి బెరడును ఎండబెట్టి పొడి చేసి తీసుకుంటే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

దంతాలకు ప్రయోజనకరం

రావిచెట్టు కాండంలో ఉండే లక్షణాలు దంతాలకు మేలు చేస్తాయి. దీని చెక్కపొడితో పళ్లు తోమడం వల్ల దంత సమస్యల నుంచి బయటపడవచ్చు. రావి నొప్పిని తొలగిస్తుంది.

దురద నుంచి ఉపశమనం

రావిచెట్టులో ఉండే గుణాలు చర్మానికి మేలు చేస్తాయి. వీటి ఆకుల రసాన్ని తాగడం వల్ల చర్మ సమస్యలు దూరమవుతాయి. ఈ కషాయం రాసుకోవడం వల్ల దురద సమస్య దూరమవుతుంది.

గాయాలు నయం

రావి ఆకులు గాయాలను నయం చేయడానికి పనిచేస్తాయి. ఏదైనా గాయంపై రావి ఆకుల పేస్ట్‌ పూయాలి. ఇది నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గాయాలను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది. ఇది లేపనం వలె పనిచేస్తుంది. అలాగే రక్తస్రావం సమస్యను తొలగించడానికి రావి ఆకులను ఉపయోగిస్తారు.

Tags:    

Similar News