Alert Married Men: పెళ్లయిన పురుషులకి అలర్ట్.. దీనిని మితిమీరి తింటే సంతానోత్పత్తిపై ఎఫెక్ట్..!
Alert Married Men: పెళ్లయిన పురుషులకి ఈ విషయం తేలికగా అనిపించినా కచ్చితంగా ఇందులో నిజం ఉంది. తొందరలో ఏదో ఒకటి తిని ఉద్యోగాలకి వెళ్లిపోతారు.
Alert Married Men: పెళ్లయిన పురుషులకి ఈ విషయం తేలికగా అనిపించినా కచ్చితంగా ఇందులో నిజం ఉంది. తొందరలో ఏదో ఒకటి తిని ఉద్యోగాలకి వెళ్లిపోతారు. ఇదే వీరు చేసే పెద్ద తప్పు. ఆహారం, ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే ఎంత సంపాదించినా అది మళ్లీ దీనికే ఖర్చు చేయల్సి ఉంటుంది. అందుకే పురుషులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పురుషులు పచ్చళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏదో ఒక సమయంలో అయితే పర్వాలేదు కానీ ప్రతిరోజు తీసుకుంటే చాలా హాని జరుగుతుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.
పెళ్లయిన పురుషులకి కుటుంబ బాధ్యతలు పెరగడంతో వారి ఆరోగ్యం గురించి పట్టించుకోరు. దీంతో శారీరక బలహీనతకి గురవుతారు. ఇలాంటి సమయంలో కొన్నిఅనారోగ్యకరమైన ఆహారాలకి దూరంగా ఉండాలి. సాధారణంగా ఆడవాళ్లు పులుపు ఎక్కువగా తినడానికి ఇష్టపడతారని అంటారు కానీ ఈ విషయంలో పురుషులు కూడా ఏమి తీసిపోరు. వీరు ఎక్కువగా ఊరగాయను తినడానికి ఇష్టపడతున్నారు. కానీ ఇది వారికి హాని కలిగిస్తుందని తెలుసుకోలేకపోతున్నారు.
నిజానికి మార్కెట్‌లో లభించే పచ్చళ్లలో వాడే మసాలా దినుసులని సరైన విధానంలో ఆరబెట్టరు. వీటిని తయారుచేయడానికి ఎక్కువ నూనెను వాడడం వల్ల కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది. సాధారణంగా ఊరగాయ చాలా స్పైసీగా ఉంటుంది. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది పురుషుల లైంగిక ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. వారి సంతానోత్పత్తిని దెబ్బతీస్తుంది. స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ నాణ్యతని తగ్గిస్తుంది.
మామిడికాయ పచ్చడిలో ఎసిటామిప్రిడ్ అనే మూలకం ఉంటుంది. ఇది పురుషుల ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇందులో ఉండే ప్రిజర్వేటివ్‌లు ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. అందుకే పురుషులు ఈ పులుపును వీలైనంత తక్కువగా తినాలి. అంతే కాకుండా నిల్వ ఉంచిన ఊరగాయ తినడం వల్ల గ్యాస్ సమస్యలు, అల్సర్, మధుమేహం వంటి వ్యాధులకి కూడా గురికావాల్సి ఉంటుంది. అందుకే వీలైనంత తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిది.