Diabetics Alert: షుగర్ పేషెంట్లకు అలర్ట్.. ఈ పానీయాలు షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తాయి..!
Diabetics Alert: దేశంలో రోజు రోజుకు షుగర్ పేషెంట్లు పెరిగిపోతున్నారు. దీనికి కారణం జీవనవిధానంలో మార్పులు రావడమే.
Diabetics Alert: దేశంలో రోజు రోజుకు షుగర్ పేషెంట్లు పెరిగిపోతున్నారు. దీనికి కారణం జీవనవిధానంలో మార్పులు రావడమే. సమయ పాలన లేని ఉద్యోగాలు చేయడం వల్ల చాలామంది జీవనవిధానం మారిపోయింది. పడుకునే సమయానికి తింటున్నారు.. తినే సమయానికి పడుకుంటున్నారు. ప్రకృతి విరుద్ధంగా పనిచేస్తూ చాలా సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అందులో భాగంగానే డయాబెటీస్ చాలామందిని వేధిస్తుంది. అయితే సహజసిద్దమైన పానీయాలతో రక్తంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
పసుపు పాలు
పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది తెలివిగా ఇన్సులిన్ సెన్సిటివిటీని నియంత్రిస్తుంది. రాత్రి సమయంలో మధుమేహం పెరగడానికి అనుమతించదు. రాత్రి పడుకునే ముందు పాలు తాగే అలవాటు ఉంటే దానికి కాస్త మిరియాల పొడి, పసుపు కలుపుకుని తాగితే షుగర్‌ను నియంత్రించడంలో బాగా పని చేస్తుంది.
తులసి టీ
ఔషధ గుణాలకు నిలయమైన తులసి ఆకులు మధుమేహాన్ని చాలా చక్కగా అదుపులో ఉంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే గుణం వీటికి ఉంటుంది. తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి టీ తయారు చేస్తారు. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే, రాత్రిపూట చక్కెర శాతంపెరగదు.
కాకర రసం
షుగర్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది తెలుసు. కాకరకాయ మధుమేహాన్ని నియంత్రించే అద్భుతమైన కూరగాయ. దీని రసం చేదుగా ఉన్నప్పటికీ మధుమేహానికి అద్భుతమైన ఔషధం. మీరు దీన్ని ప్రతి రాత్రి తీసుకోవడం అలవాటు చేసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.
మెంతి గింజల నీరు
మెంతి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆహారంలో కనిపించే చక్కెర శోషణను తగ్గిస్తుంది. దీంతో మధుమేహం అదుపులో ఉంటుంది. దీని కోసం మీరు ఒక టేబుల్ స్పూన్ మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి ప్రతి రోజు ఉదయం పరగడుపున తాగాలి. ఇలా చేయడం వల్ల షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది.
దాల్చిన చెక్క టీ
మనం వంటలో ఉపయోగించే దాల్చిన చెక్కలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే గుణం ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం గిన్నెలో నీరు తీసుకొని అందులో రెండు దల్చిన చెక్కలు వేసుకొని మరిగించాలి. ఈ నీటిని వడబోసి రుచి పెరగాలంటే కాస్త నిమ్మరసం కలుపుకొని తాగాలి. రాత్రి పడుకునే ముందు ఈ డ్రింక్ తాగి షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు.