Health Tips: షుగర్‌ పేషెంట్లకి అలర్ట్‌.. పాలలో ఇది నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు..!

Health Tips: పిస్తాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ బి6, ప్రొటీన్, కాల్షియం, ఐరన్ పెద్ద మొత్తంలో లభిస్తాయి.

Update: 2023-02-16 11:30 GMT

Health Tips: షుగర్‌ పేషెంట్లకి అలర్ట్‌.. పాలలో ఇది నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు..!

Health Tips: పిస్తాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ బి6, ప్రొటీన్, కాల్షియం, ఐరన్ పెద్ద మొత్తంలో లభిస్తాయి. రోజూ పిస్తాపప్పును తీసుకుంటే అనేక రోగాలు దూరమవుతాయి. అయితే చాలా మంది పిస్తాపప్పును నీటిలో నానబెట్టి తింటారు. కానీ పిస్తాపప్పును పాలలో మరిగించి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

కండరాలు బలోపేతం

పిస్తాపప్పులు, పాలు కలిపి తీసుకోవడం వల్ల కండరాలు బలపడతాయి. ఎందుకంటే ఈ కాంబినేషన్‌లో కండరాలను బలోపేతం చేసే ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని రోజు తీసుకోవాలి.

ఎముకలు దృఢత్వం

పిస్తా పప్పులను పాలలో మరిగించి తింటే ఎముకలకు బలం చేకూరుతుంది. ఎందుకంటే పాలు పిస్తాలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలకు ఉపయోగకరంగా ఉంటుంది. పిస్తాలను పాలలో మరిగించడం వల్ల కీళ్ల నొప్పులు దూరమవుతాయి.

కళ్లకు ప్రయోజనాలు

మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో నిరంతరం పనిచేసే వ్యక్తుల కళ్లపై చెడు ప్రభావం ఉంటుంది. ఈ పరిస్థితిలో మీరు పిస్తాలను పాలలో ఉడికించి తినవచ్చు. దీనివల్ల కళ్లకు మేలు జరుగుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది.

బ్లడ్ షుగర్ కంట్రోల్‌

పిస్తా పాలు కలిపి తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది. పాలలో ఉడకబెట్టిన పిస్తా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

Tags:    

Similar News