Health Tips: సిగరెట్ తాగేవారికి అలర్ట్.. ఈ ఆహారాలని కచ్చితంగా డైట్‌లో చేర్చుకోండి..!
Health Tips: ఊపిరితిత్తులు మన శరీరంలోని ముఖ్యమైన భాగాలలో ఒకటి.
Health Tips: ఊపిరితిత్తులు మన శరీరంలోని ముఖ్యమైన భాగాలలో ఒకటి. ఊపిరితిత్తుల నుంచి ఫిల్టర్ అయిన ఆక్సిజన్ మొత్తం శరీరానికి చేరుతుంది. అయితే నేటికాలంలో అనారోగ్య జీవనశైలి, వాయుకాలుష్యం, సిగరెట్ తాగడం వల్ల చాలా మంది ఊపిరితిత్తులు బలహీనంగా మారుతున్నాయి. దీని కారణంగా ఒక వ్యక్తి ఆస్తమా, బ్రోన్కైటిస్, న్యుమోనియా లేదా TB వంటి శ్వాస సంబంధిత ప్రాణాంతక వ్యాధుల బారినపడుతున్నాడు. ఈ పరిస్థితిలో ఊపిరితిత్తులను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని ఆహారాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
యాపిల్
రోజూ యాపిల్ తినడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి . ఇందులో ఉండే విటమిన్లు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా మారుస్తాయి. రోజూ యాపిల్ తినాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు.
అల్లం
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల నుంచి కాలుష్యాన్ని బయటకు పంపడంలో సహాయపడుతాయి. ఇవి ఊపిరితిత్తుల వాయుమార్గాలను తెరుస్తాయి. దీని కారణంగా ఆక్సిజన్ ప్రసరణ బాగా జరుగుతుంది.
అవిసెగింజలు
అవిసెగింజలని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినకుండా ఉంటాయి. అంతే కాదు దెబ్బతిన్న భాగాలను నయం చేయడంలో ఇవి సహకరిస్తాయి.
వాల్‌నట్స్
ఈ డ్రై ఫ్రూట్‌లో ఒమేగా-2 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతాయి. ఒక అధ్యయనం ప్రకారం ప్రతిరోజూ కొన్ని వాల్‌నట్‌లను తినడం వల్ల శ్వాసకోశ సమస్యలను నయం చేయవచ్చు.
కొవ్వు చేపలు
కొవ్వు చేపలు ఊపిరితిత్తులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే వీటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు తగినంత పరిమాణంలో ఉంటాయి.
బ్రకోలి
ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో బ్రకోలీ ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా బ్రోకలీ తీసుకోవడం వల్ల స్టామినా పెరుగుతుంది.