Salt Side Effects: ఉప్పు విషయంలో అలర్ట్.. ఈ వ్యాధులన్నీదీనివల్లే..!
Salt Side Effects: ఉప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే శరీరానికి చాలా ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే దీనిని ఎక్కువగా తీసుకున్నా తక్కువగా తీసుకున్నా ఎలాగైనా శరీరానికి నష్టమే జరుగుతుంది.
Salt Side Effects: ఉప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే శరీరానికి చాలా ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే దీనిని ఎక్కువగా తీసుకున్నా తక్కువగా తీసుకున్నా ఎలాగైనా శరీరానికి నష్టమే జరుగుతుంది. ఆహారంలో ఉప్పు ఎక్కువగా వేస్తే దాని రుచి చెడిపోతుంది తక్కువ ఉంటే ఆహారం రుచి ఉండదు. ఉప్పు విషయంలో 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. టేబుల్ సాల్ట్‌లో అధిక సోడియం కంటెంట్ ఉంటుంది. దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. WHO ప్రకారం ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల 1.89 మిలియన్ల మంది చనిపోతున్నారు. ఉప్పు వల్ల కలిగే వ్యాధుల గురించి తెలుసుకుందాం.
గుండె వ్యాధి
టేబుల్ సాల్ట్‌లో సోడియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు ఎక్కువగా వాడితే శరీరంలో నీరు ఎక్కువగా చేరుతుంది. శరీరంలో నీరు పెరగడం వల్ల రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల హై బీపీ, గుండెపోటు ప్రమాదం పొంచి ఉంది.
మూత్రపిండాల వ్యాధి
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయి. ఉప్పు మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. దీనితో పాటు కిడ్నీ ఫెయిల్యూర్ ప్రమాదం కూడా పెరుగుతుంది.
ఎముకలు బలహీనంగా మారుతాయి
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. లోపల నుంచి బోలుగా మారుతాయి. దీని వల్ల చిన్న వయసులోనే వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పుల సమస్యలు పెరుగుతాయి.
ఒక రోజులో ఎంత ఉప్పు తినాలి..?
'ప్రపంచ ఆరోగ్య సంస్థ' ప్రకారం ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతిరోజూ 5 గ్రాముల ఉప్పు తినాలి. అంటే ఒక వ్యక్తి మొత్తం రోజులో 1 టీస్పూన్ కంటే ఎక్కువ ఉప్పు తినకూడదు. చిప్స్, జంక్ ఫుడ్, పండ్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బయటి ఆహారం తినడం మానేస్తే మంచిది.