Sleeping Hours: ఆరోగ్యకరమైన జీవితానికి సరిపడా నిద్ర కావాలి.. నవజాత శిశువు నుంచి వృద్దుల వరకు ఎన్ని గంటల నిద్ర అవసరం..!

Sleeping Hours: మనిషి జీవితంలో నిద్ర అనేది చాలా ముఖ్యం. ఇది బాడీని రెన్యువల్‌ చేసి శక్తిని అందిస్తుంది.

Update: 2024-01-25 16:00 GMT

Sleeping Hours: ఆరోగ్యకరమైన జీవితానికి సరిపడా నిద్ర కావాలి.. నవజాత శిశువు నుంచి వృద్దుల వరకు ఎన్ని గంటల నిద్ర అవసరం..!

Sleeping Hours: మనిషి జీవితంలో నిద్ర అనేది చాలా ముఖ్యం. ఇది బాడీని రెన్యువల్‌ చేసి శక్తిని అందిస్తుంది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది. నిద్ర లేకపోవడం వల్ల అలసట, ఏకాగ్రత, చిరాకు, తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. అన్ని వయసుల వారికి నిద్ర అవసరం. పిల్లలకు ఎక్కువ నిద్ర అవసరం. వయస్సు ప్రకారం ఎవరికి ఎన్ని గంటల నిద్ర అవసరమో ఈ రోజు తెలుసుకుందాం.

నవజాత శిశువులు అభివృద్ధి చెందడానికి ఎక్కువ సమయం అవసరం. వారికి ప్రతిరోజూ దాదాపు 14 నుంచి 17 గంటల నిద్ర అవసరం. శరీర అవయవాల అభివృద్ధి, పనితీరు కోసం శిశువులకు 12 నుంచి 15 గంటల నిద్ర అవసరం. క్రీడలలో శక్తిని ఖర్చు చేయడానికి, మెదడు సరిగ్గా పనిచేయడానికి చిన్న పిల్లలకు 11 నుంచి 14 గంటల నిద్ర అవసరం. చదువు ప్రారంభించే పిల్లలకు చాలా విశ్రాంతి అవసరం. వారికి 10 నుంచి 13 గంటల నిద్ర సరిపోతుంది.

స్కూల్ పిల్లలు ఎదిగే వయసులో ఉంటారు కాబట్టి వారు 9 నుంచి 12 గంటలు నిద్రపోవాలి. టీనేజ్ వయసువారు క్రీడలు ఆడతారు, చదువుతారు కాబట్టి 8 నంచి 10 గంటలు నిద్రపోవాలి. పెద్దలకు పని, కుటుంబ బాధ్యతల వల్ల నిద్ర సరిగా రాకపోయినా 7 నుంచి 9 గంటలు నిద్రపోయేలా చూడాలి. వయసుతో పాటు త్వరగా అలసట వస్తుంది. అయితే కీళ్ల నొప్పులు, నిద్రలేమి వంటి సమస్యల వల్ల నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నారు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారు.

Tags:    

Similar News