Weight Loss Diet: ఈజీగా బరువు తగ్గాలా.. డైట్‌లో ఇవి చేర్చితే సరి.. మీ కళ్లను మీరే నమ్మలేరంతే..!

Weight Loss Diet: పుదీనాను ప్రతి ఇంట్లో అనేక ఆహార పదార్థాలలో ఉపయోగిస్తుంటారు.

Update: 2023-04-18 01:30 GMT

Weight Loss Diet: ఈజీగా బరువు తగ్గాలా.. డైట్‌లో ఇవి చేర్చితే సరి.. మీ కళ్లను మీరే నమ్మలేరంతే..!

Weight Loss Diet: పుదీనాను ప్రతి ఇంట్లో అనేక ఆహార పదార్థాలలో ఉపయోగిస్తుంటారు. పుదీనా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ కారణంగానే పుదీనాను ఆహార పదార్థాలలో ఎక్కువగా తీసుకుంటుంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో పుదీనా ఆకులను ఖచ్చితంగా ఆహారంలో చేర్చుకుంటారు. పుదీనా నీటితో మీ పెరుగుతున్న బరువును ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

పుదీనా ఆకులకు నిమ్మరసం కలిపి తిసుకుంటే బరువు తగ్గవచ్చు. బరువు తగ్గడానికి పుదీనాను తప్పనిసరిగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక గ్లాసు నీటిలో 8 నుంచి 10 పుదీనా ఆకులు, నిమ్మరసం, నల్ల మిరియాల పొడి, నల్ల ఉప్పు కలపండి. వాటన్నింటిని మిక్సీలో సరిగ్గా గ్రైండ్ చేసి వడపోసి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేయడం వల్ల అధికంగా పెరిగిన కొవ్వును క్రమంగా తగ్గించడంలో సహాయపడుతుంది.

మింట్ డిటాక్స్ వాటర్..

మింట్ డిటాక్స్ వాటర్ చేయడానికి, ఒక గ్లాసు నీటిలో సగం చిన్న యాపిల్, దానిమ్మ గింజలు, పుదీనా ఆకులు, నిమ్మరసం మిక్స్ చేసి, బాగా మిక్స్ చేసి రోజంతా ఎప్పటికప్పుడు ఈ నీటిని తాగాలి. ఇది బరువు తగ్గడంలో చాలా సహాయపడుతుంది.

పుదీనా, కొత్తిమీరతో..

పుదీనాతో పాటు కొత్తిమీర ఆకులు కూడా బరువును తగ్గించడంలో సహాయపడతాయి. పుదీనా, కొత్తిమీర రెండింటినీ కలిపి తీసుకుని, ఆ తర్వాత వాటిని బాగా గ్రైండ్ చేసి, వడగట్టిన తర్వాత తాగాలి.

బరువు తగ్గడానికి పుదీనాను ఆహారంలో ఎలా తీసుకోవాలంటే..

1. పుదీనా టీ..

ఇందుకోసం ఎండిన పుదీనా ఆకులు లేదా తాజా వాటిని ఉపయోగించవచ్చు. పుదీనా ఆకులను తీసుకొని మరిగే నీటిలో కాసేపు ఉంచాలి. అలా ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి. చల్లారిన తర్వాత తాగాలి. ఉత్తమ ఫలితాల కోసం రోజుకు 2-3 కప్పుల పుదీనా టీని తాగవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

2. పుదీనా రసం..

పుదీనా ఆకులతోపాటు కొత్తిమీర ఆకులను తీసుకోవాలి. బ్లెండర్‌లో ఒక గ్లాసు నీరు, చిటికెడు నల్ల ఉప్పు, నల్ల మిరియాలు జోడించాలి. అన్ని పదార్థాలను బాగా గ్రైండ్ చేయాలి. అందులో సగం నిమ్మకాయ రసాన్ని పిండుకుని, ఉదయాన్నే ఒక గ్లాసు జ్యూస్‌ని తాగాలి.

4. పుదీనా రైతా..

రైతా మనందరికీ తెలిసిందే. అయితే, ఇందులో పుదీనాను ఎక్కువ తీసుకుని వాడుకుంటే చాలా మంచింది. జీవక్రియను సక్రమంగా ఉంచేలా చేస్తుంది. అయితే, ఇందులో చక్కెరను మాత్రం కలపొద్దు. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది.

4. ఆహారంలో పుదీనా..

కొన్ని తాజా పుదీనా ఆకులను తీసుకుని, ఇష్టమైన సలాడ్‌లో వేసి తీసుకోవచ్చు. ఇది కడుపు ఉబ్బరాన్ని నివారించడమే కాకుండా, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. కానీ, కొవ్వు పదార్ధాలు, నూనె పదార్ధాలతో పుదీనాను కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే వాటిలో కేలరీలు అధిరంగా ఉంటాయి.

Similar News