Crying Health Benefits: ఏడిస్తే ఇది తగ్గుతుందట.. వారానికి ఒక్కసారి ఇలా చేయాలట..!
Crying Health Benefits: కొన్నిసార్లు మనకు బాధ కలిగించే విషయాలు కూడా మనకి మేలు చేస్తాయి.
Crying Health Benefits: కొన్నిసార్లు మనకు బాధ కలిగించే విషయాలు కూడా మనకి మేలు చేస్తాయి. జీవితంలో ప్రతి ఒక్కరూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటారు కానీ ఏడవాలని అనుకోరు. అయితే అప్పుడప్పుడు ఏడవడం కూడా మేలు చేస్తుందని ఓ పరిశోధనలో తేలింది. బహిరంగంగా నవ్వడం ఆరోగ్యానికి ఎంత మంచిదో బహిరంగంగా ఏడవడం కూడా అంతే మంచిదని చెబుతున్నారు. ఇది మీకు వింతగా అనిపించినా పూర్తిగా నిజం. వారానికోసారి ఏడిస్తే చాలా మంచిదని అంటున్నారు. ఈ ఆసక్తికరమైన విషయం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఒక వెబ్‌సైట్ ప్రకారం ఏడుపు అనేది ఒత్తిడిని తగ్గించే మందు. బాధాకరమైన పాటలు వినడం, ఏడ్చే సినిమాలు చూడడం లేదా విచారకరమైన పుస్తకాలు చదవడం వంటివి చేయడం వల్ల మన శరీరంలోని పారాసింపథెటిక్ నాడి చురుగ్గా మారుతుంది. దీని కారణంగా హృదయ స్పందన మందగిస్తుంది మెదడుపై ఓదార్పు ప్రభావం ఏర్పడుతుంది. వారానికి ఒకసారి ఏడ్చినట్లయితే, మీరు చాలా కాలం పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.
ఈ వెబ్‌సైట్ ప్రజలను ఏడ్చే వీడియోలను చూడమని ప్రోత్సహిస్తోంది. దీనివల్ల మనిషి మానసిక బాధల నుంచి ఉపశమనం పొందుతాడని చెబుతోంది. కొంతమంది ఎన్ని ట్రీట్‌మెంట్ తీసుకున్నా, ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా వారి మనసులోని బాధ కొనసాగుతూనే ఉంటుంది. దీనికి ఏడుపు ఒక్కటే మార్గమని చెబుతోంది. ఎందుకంటే ఏడవడం వల్ల మైండ్‌పై స్ట్రెస్ తగ్గుతుంది. మనసుకు ఒక ఓదార్పు దొరుకుతుంది. ఇది సహజసిద్దంగా ఉండాలి.