Short Nap: పగటిపూట ఈ చిన్న పని చేస్తే ఇతరుల కంటే తెలివిగ మారుతారు..!
Short Nap: కొంతమందికి రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టదు. దీంతో మరుసటి రోజు మొత్తం డల్‌గా కనిపిస్తారు. అంతేకాదు ఏ పని చేయాలనిపించదు.
Short Nap: కొంతమందికి రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టదు. దీంతో మరుసటి రోజు మొత్తం డల్‌గా కనిపిస్తారు. అంతేకాదు ఏ పని చేయాలనిపించదు. తరచుగా నిద్ర వస్తుంటుంది. మరికొంతమంది రాత్రిపూట బాగా నిద్రిస్తారు. అయినప్పటికీ మధ్యాహ్నం మరొక అర్ధగంట పడుకుంటారు. ఇంకొంత మంది రాత్రిపూట బాగా నిద్రిస్తారు. కానీ మధ్యాహ్నం పడుకోరు. ఈ మూడు రకాల వారిలో మధ్యాహ్నం పడుకునే వారి మైండ్ షార్ప్‌గా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం.
పగటిపూట నిద్రపోవాలా వద్దా?
పగటిపూట నిద్రపోవడం వల్ల ఒత్తిడి ఉండదు. రోజంతా తాజాగా ఉంటారు. ఇది మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. పగటిపూట నిద్రపోవడం ప్రయోజనకరంగా ఉంటుందని చాలా అధ్యయనాల్లో నిరూపణ అయింది.
స్మార్ట్‌గా మారుతారు
రోజుకు 30నుంచి 90 నిమిషాలు పగటిపూట నిద్రపోయే వ్యక్తులు మిగతావారితో పోలిస్తే షార్ప్‌గా ఉంటారు. వారి జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. పదాలను గుర్తుంచుకోవడానికి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే అన్ని విషయాలను బాగా అర్థం చేసుకోగలడు.
నిద్రపోవడం వల్ల ప్రయోజనాలు
1. గుండె జబ్బులు తగ్గుతాయి
2. అలసట ఉండదు
3. మనస్సు అప్రమత్తంగా ఉంటుంది
4. మానసిక స్థితి తాజాగా ఉంటుంది
ఈ విషయం తెలుసుకోండి,
మీరు రోజులో ఎక్కువసేపు నిద్రపోతే నిద్రకు సంబంధించిన సమస్యలు వస్తాయి.అధిక రక్తపోటు, డిప్రెషన్, బోలు ఎముకల వ్యాధి, రోగనిరోధక శక్తి తగ్గడం, ఊబకాయం, మలబద్ధకం వంటి సమస్యలు ఎదురవుతాయి.