డాక్టర్లు లేరని కాన్పు చేసిన నర్సులు, ఇద్దరు పసికందులు మృతి

Update: 2019-05-11 05:17 GMT

సరైన అనుభవం లేకుండా ట్రీట్మెంట్ చేసి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది.. వైద్యం కోసం వచ్చే వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూన్నారు . వైద్యులు అందబాటులో లేక నర్సులు కాన్పు చేయడంతో ఇద్దరు పసికందులు కన్నుమూశారు. ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిజామాబాద్ మరియు పచ్చిమ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంది ..

నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఓ గర్భిణి కాన్పు కోసం వచ్చింది. కానీ సమయానికి వైద్యులు ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవటంతో సూపర్‌వైజర్‌ డెలివరీ చేశాడు. ఆ వైద్యం వికటించి మగ శిశువు చనిపోయింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పసికందు చనిపోయిందని బంధువుల ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇటు పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పెదపాడులోని ఆస్పత్రిలో నర్స్‌లు వైద్యుల పర్యవేక్షణ లేకుండా డెలివరీ చేయడంతో మగశిశువు చనిపోయాడు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పసికందు చనిపోయిందని బంధువుల ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

Similar News