ఇటివల అనుమానాస్పద స్థితిలో ఈనెల 16తేదని మృతిచెందిన ఎన్డీ తివారీ కుమారుడి రోహిత్ శేఖర్ మృతి కేసులో కొత్త మలుపు తిరిగింది. రోహిత్ శేఖర్‌ది సహజ మరణం కాదు హత్యేనని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఓ నిర్దారణకు వచ్చారు. అయితే ముఖంపై దిండుతో ఒత్తి ఊపిరాడకుండా చేసి రోహిత్ శేఖర్ ప్రాణాలు విడిచాడని తెలుసుకున్నారు. అయితే అంతకుముందు, రోహిత్ ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం రావడంతో ఇంట్లో పనివాళ్లు ఆసుపత్రికి తరలించారు. తన గదిలో నిద్రిస్తున్న రోహిత్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడని భార్య అపూర్వ చెప్పింది. కాగా వీళ్లిద్దరికీ కిందటేడాదే పెళ్లయింది. అయితే, పోస్టుమార్టం తర్వాత రోహిత్ మరణం సహజమరణం కాదని వెల్లడైంది. దాంతో, రోహిత్ మృతిని హత్య కేసుగా నమోదుచేయడమే కాకుండా, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కు బదిలీ చేశారు. ఇక కేసు టేకప్ చేసిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అధికారులు నేడు రోహిత్ శేఖర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను, ఇంట్లో పనివాళ్లను ప్రశ్నించారు.