Rain Alert: నేడు తీరం దాటనున్న తుపాన్..తెలంగాణలో 3 రోజులు ఓ మోస్తరు వర్షాలు..పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ

Update: 2024-11-30 00:04 GMT

Rain Alert: బంగాళాఖాతంలో నేడు తుపాన్ తీరం దాటనుంది. దీని ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో శని, ఆది, సోమవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ సూచించింది.

తెలంగాణ రాష్ట్రంలో, శనివారం, ఆదివారం, సోమవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ సూచించింది. శనివారం ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యపేట, మహబూబాబాద్, నల్లగొండ, వరంగల్, హన్మకొండి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆదివారం, సోమవారాల్లో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉంది. ఈ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

కాగా నవంబర్ నెల భారీ వర్షాలతోనే ముగిసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఫెంగల్ తుపాన్ వాయవ్య దిశగా గంటకు 15కిలోమీటర్ల వేగంతో కదులతోంది. ఇది నవంబర్ 30వ తేదీ మధ్యాహ్నం తర్వాత తమిళనాడు పుదుచ్చేరి తీరాల వద్ద కరైకల్ మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తోందని ఐఎండీ చెప్పింది. తుపాన్ తీరం దాటే సమయంల గంటకు 70 నుంచి 30కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఈ తుపాన్ కారణంగా నేడు రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కొన్నిచోట్ల ఒకేసారి, ఒకేచోట భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ తెలిపింది. 

Tags:    

Similar News