పోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం: రాజకీయ శరణార్ధిగా చూడాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు పిటిషన్

Telangana Phone Tapping Case: పోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ శరణార్దిగా తనను గుర్తించాలని ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వాన్ని కోరారు.

Update: 2024-11-29 07:08 GMT

Telangana Phone Tapping Case

Telangana Phone Tapping Case: పోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ శరణార్దిగా తనను గుర్తించాలని ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన అమెరికా ప్రభుత్వానికి పిటిషన్ పెట్టుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలోని తన కొడుకు వద్ద తాను ఉంటున్నాని ఆయన ఆ పిటిషన్ లో చెప్పారు. తనకు అనారోగ్య సమస్యలున్నాయని ఆయన ఆ పిటిషన్ లో వివరించారు.

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇంటలిజెన్స్ విభాగంలో ఓఎస్ డీ గా ఆయన పనిచేశారు. రిటైరైన తర్వాత కూడా ఆయనను కొనసాగించారు. ఈ విభాగంలో ప్రభాకర్ రావుతో పాటు రిటైరైన ఉద్యోగుల సేవలను ఉపయోగించుకున్నారు. ప్రభాకర్ రావు కనుసన్నల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని అప్పట్లో టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేస్తామని చెప్పారు.

బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ప్రణీత్ రావు అరెస్టయ్యారు. ఆ తర్వాత తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావును సిట్ అరెస్ట్ చేసింది.

Tags:    

Similar News