మంత్రి కొండా సురేఖకు గురువారం నాడు నాంపల్లి కోర్టు సమన్లు పంపింది. సురేఖపై నటులు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.డిసెంబర్ 12న వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
అక్కినేని నాగచైతన్య, సమంతల విడాకుల విషయంలో మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ విషయమై నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు మంత్రి సురేఖకు సమన్లు పంపారు.ఈ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలకు సమంతకు సురేఖ క్షమాపణలు చెప్పారు.ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కోరారు.