Viral Video: బిర్యానీలో సిగరేట్ పీక.. వైరల్ అవుతున్న వీడియో.. ఇంతకీ ఎక్కడో తెలుసా..?

Cigarette Found In Bawarchi Biryani Video: హైదరాబాద్‌లో బిర్యానీ ఫేమస్. తోపుడు బండ్ల నుంచి ప్రముఖ హోటళ్ల వరకు మాంసాహార వంటకాలదే హవా.

Update: 2024-11-26 09:19 GMT

బిర్యానీలో సిగరేట్ పీక.. వైరల్ అవుతున్న వీడియో.. ఇంతకీ ఎక్కడో తెలుసా..?

Cigarette Found In Bawarchi Biryani Video: హైదరాబాద్‌లో బిర్యానీ ఫేమస్. తోపుడు బండ్ల నుంచి ప్రముఖ హోటళ్ల వరకు మాంసాహార వంటకాలదే హవా. వీకెండ్ వచ్చిందంటే చాలు బయటకు వెళ్లి బిర్యానీ రుచి చూడటం సాధారణం. అలాంటి బిర్యానీ విషయంలో అనేక కల్తీ ఘటనలు జరుగుతుండడం భోజన ప్రియులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు బిర్యానీలో పురుగులు, బొద్దింకలు, జంతువుల అవశేషాలు రావడం చూశాం. తాజాగా ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని బావార్చికి బిర్యానీ తిందామని వెళ్లిన కస్టమర్లకు షాకింగ్ అనుభవం ఎదురైంది. బిర్యాని ఆర్డర్ ఇచ్చిన వారికి అందులో సిగరెట్ పీక దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

బిర్యానీ తినేందుకు కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బావార్చికి వెళ్లారు. అక్కడ బిర్యాని ఆర్డర్ చేసిన వారికి అందులో ఏదో వెరైటీగా కన్పించింది. ఏంటని చూడగా అది సిగరేట్ ముక్క. దీంతో అక్కడున్న వాళ్లను ప్రశ్నించగా.. మరో బిర్యాని ఇస్తామని సింపుల్‌గా సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు మాత్రం బిర్యానీలో ఇంకేమేం చూడాల్సి వస్తుందోనని కామెంట్స్ చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్స్, హోటల్స్‌లో నిత్యం ఇలాంటి ఘటనలు ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఆ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఎక్స్‌పైరీ అయిపోయిన పదార్థాలను వాడటం, కుళ్లిపోయిన మాంసం వంటివి ఎన్నో సందర్భాల్లో వెలుగులోకొచ్చాయి. ఈ విషయంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తీరుపైనా విమర్శలొస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కస్టమర్ల ఫిర్యాదు చేస్తున్నారు. అధికారులు వచ్చి తనిఖీలు చేపట్టి, కేసులు బుక్ చేసి, జరిమానాలు విధించి వెళ్లిపోతున్నారే తప్ప వీటికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలొస్తున్నాయి. అందుకే హోటల్స్ నిర్వాహకులు తనిఖీల తరువాత కూడా మళ్లీ యధావిధిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గతవారం తాజ్ మహల్ హోటల్‌లో పన్నీర్ బిర్యానీలో జెర్రి కనిపించింది. అలాగే అల్వాల్ యతి హౌస్ హోటల్ లోని బిర్యానీలో బొద్దింకలు కనిపించాయి. మరో రెస్టారెంట్‌లో బల్లి దర్శనమిచ్చింది. ఇంకో రెస్టారెంట్లో కుళ్లిన చికెన్, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలతో బిర్యానీ తయారు చేసినట్టు ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో వెల్లడైంది. ఇలా వరుస సంఘటనలతో హోటల్స్, రెస్టారెంట్లలో బిర్యానీ తినాలంటేనే భాగ్యనగర ప్రజలు భయపడుతున్నారు.


Tags:    

Similar News