India vs Pakistan: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌.. లైవ్ మ్యాచ్ ఫ్రీగా ఎక్కడ చూడొచ్చో తెలుసా?

India vs Pakistan, U19 Asia Cup 2024 live streaming: శనివారం (డిసెంబర్ 30)న దాయాది భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.

Update: 2024-11-29 17:12 GMT

India vs Pakistan: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌.. లైవ్ మ్యాచ్ ఫ్రీగా ఎక్కడ చూడొచ్చో తెలుసా?

India vs Pakistan, U19 Asia Cup 2024 live streaming: యూఏఈ వేదికగా అండర్ 19 ఆసియా కప్ 2024 ఆరంభమైంది. నేడు రెండు మ్యాచులు జరగగా.. అఫ్గానిస్థాన్‌పై బంగ్లాదేశ్, నేపాల్‌పై శ్రీలంక విజయం సాధించాయి. శనివారం (డిసెంబర్ 30)న దాయాది భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శనివారం ఉదయం 10.30కు ఆరంభం కానుంది. మహమ్మద్ అమన్ సారథ్యంలో భారత్, సాద్ బేగ్ నేతృత్వంలో పాక్ జట్టు బరిలోకి దిగుతున్నాయి. టోర్నీలో ఇదే మొదటి మ్యాచ్ కావడంతో ఇరు జట్లు విజయంసాధించాలని చూస్తున్నాయి.

అండర్ 19 ఆసియా కప్ టోర్నీ బ్రాడ్‌కాస్టింగ్ భారత్ రైట్స్ సోనీ నెట్‌వర్క్‌ వద్ద ఉన్నాయి. సోనీ నెట్‌వర్క్‌ ఛానెల్స్‌తో పాటు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అయితే సోనీ నెట్‌వర్క్‌ ఛానెల్స్, సోనీ లివ్‌లో మ్యాచ్‌లు చూడాలంటే.. సబ్‌స్క్రైబ్ చేసుకోవావాల్సి ఉంటుంది. జియో టీవీ, ఎయిర్టెల్ టీవీ యాప్‌లో మాత్రం ఫ్రీగా చూడొచ్చు. రెండు యాప్‌లలో సోనీ టెన్ ఛానెల్స్‌ను ఎంచుకొని మ్యాచ్‌లను ఎంజాయ్ చెయ్యొచ్చు. భారత కాలమాన ప్రకారం.. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శనివారం ఉదయం 10 గంటలకు టాస్ పడనుండగా.. 10.30కు మ్యాచ్ మొదలవుతుంది.

భారత్ అండర్ 19 జట్టులో అందరి కళ్లు 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. అతడు ఎలా ఆడుతాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జెడ్డాలో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ1.1 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ అతడిని కొనుగోలు చేసింది. అందుకే అందరి ద్రుష్టి సూర్యవంశీపై ఉంది. ఇక టోర్నీలో 8 జట్లు తలపడుతుండగా రెండు గ్రూప్‌లుగా విభజించారు. బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, అఫ్గానిస్థాన్ టీమ్స్ గ్రూప్-ఏలో ఉండగా.. భారత్, పాకిస్థాన్, యూఏఈ, జపాన్ జట్లు గ్రూప్-బీలో ఉన్నాయి.

జట్లు:

భారత్: హార్దిక్ రాజ్, వైభవ్ సూర్యవంశీ, ప్రణవ్ పంత్, కేపీ కార్తికేయ, హర్వాన్ష్ సింగ్ (కీపర్), మహమ్మద్ అమన్ (కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, సమర్థ్ నాగరాజ్, నిఖిల్ కుమార్, యుధాజిత్ గుహ, చేతన్ శర్మ, కిరణ్ చోర్మలే, అనురాగ్ కవాడే, ఆండ్రీ సిద్దార్థ్ సి, మహ్మద్ ఈనాన్.

పాకిస్తాన్:

మహ్మద్ తయ్యబ్ ఆరిఫ్, ఫర్హాన్ యూసఫ్, షాజైబ్ ఖాన్, సాద్ బేగ్ (కెప్టెన్/కీపర్), హరూన్ అర్షద్, అలీ రజా, అహ్మద్ హుస్సేన్, మహ్మద్ రియాజుల్లా, ఉస్మాన్ ఖాన్, అబ్దుల్ సుభాన్, ఫహమ్-ఉల్-హక్, మహ్మద్ హుజైఫా, ఉమర్ జైబ్, మహ్మద్ అహ్మద్, నవీద్ అహ్మద్ ఖాన్.

Tags:    

Similar News