ఆ ముచ్చట సంక్రాంతి తర్వాతే.. కేసీఆర్ సంచలన నిర్ణయం!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. సంక్రాంతి తర్వాతే కేబినెట్ విస్తరణ ఉంటుందంటూ సంకేతాలిచ్చారు. సంక్రాంతి రోజులు మంచివి కావన్న ఉద్దేశంతో ఉన్న కేసీఆర్ తర్వాతే నిర్ణయం తీసుకోనున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తదితర అధికారిక కార్యక్రమాలన్నీ సంక్రాంతి తర్వాతనే నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. సంక్రాంతి తర్వాతే కేబినెట్ విస్తరణ ఉంటుందంటూ సంకేతాలిచ్చారు. సంక్రాంతి రోజులు మంచివి కావన్న ఉద్దేశంతో ఉన్న కేసీఆర్ తర్వాతే నిర్ణయం తీసుకోనున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తదితర అధికారిక కార్యక్రమాలన్నీ సంక్రాంతి తర్వాతనే నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఒకే స్వభావం కలిగిన శాఖలన్నింటికీ కలిపి ఒకే మంత్రిత్వ శాఖ పరిధిలోకి తేవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీనికోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి తర్వాతే కేబినెట్ విస్తరణ ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారాలు కూడా సంక్రాంతి తర్వాతే ఉంటాయని చెప్పినట్లు తెలుస్తోంది. ఒకేసారి మొత్తం మంత్రివర్గాన్ని తీసుకోకుండా, తొలి దశలో కొందర్ని కేబినెట్‌లోకి తీసుకుని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మిగతా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.ఇక పార్లమెంట్ సెక్రటరీల నియామకంపైనా కేసీఆర్ దృష్టి పెట్టారు. అవసరమైతే చట్టం చేసైనా పార్లమెంట్ సెక్రటరీలను నియమించాలన్న ఉద్దేశంతో ఉన్నారని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు.