Gold Rate Today: ఏకంగా రూ. 2వేలకు పైగా తగ్గిన బంగారం ధర.. ఎలాగో తెలిస్తే వెంటనే కొంటారు

Update: 2024-12-15 01:38 GMT

Gold Price: బంగారం కొనే ఆలోచనలో ఉన్నట్లయితే ఇప్పుడే కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నేడి డిసెంబర్ 15వ తేదీ దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 77,121 పలుకుతుండగా..1 గ్రాముకు 7,717 రూపాయలు అవుతుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 70, 694 ఉండగ..1 గ్రాముకు రూ. 7,069 ఉంది. మీరు గ్రాముల కొనుగోలు చేస్తే అదనంగా 1500 తరుగు అవుతుంది. అది కూడా లెక్కలోకి తీసుకుంటారు.

ఈ వారంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 79, 026 ఉంది. అతి తక్కువగా రూ. 77,121 నమోదు అయ్యింది. ఈ వారంలో 1,900 తగ్గింది. ఈ వారంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు అత్యధికంగా రూ. 72,900 ఉండగా..తక్కువగా రూ. 70, 694 ఉంది. ఈ వారంలో మొత్తం 2,206 తగ్గింది. అంటే మీరు ఇప్పుడు 10 గ్రాములు కొంటే మీకు అది రూ. 2,206ధర తక్కువకే లభిస్తుందని అర్థం.

గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధర 5 వారాల గరిష్టానికి చేరుకుంది. దీని తర్వాత, శుక్రవారం బంగారం భారీ పతనమైంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, నగల వ్యాపారులు, స్టాకిస్టులు భారీగా విక్రయించడం వల్ల ఇది జరిగింది. వాస్తవానికి, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ (పిపిఐ) పతనం, వారంవారీ నిరుద్యోగం క్లెయిమ్‌ల పెరుగుదల తర్వాత లాభ-బుకింగ్ తీవ్రతరం కావడం వల్ల యుఎస్‌లో బంగారం అమ్మకాలు బాగా పెరిగాయి. డాలర్‌లో పెరుగుదల,మిశ్రమ US స్థూల ఆర్థిక గణాంకాలు ఈ సంవత్సరం ఫెడరల్ రిజర్వ్ చివరి పాలసీ సమావేశానికి ముందు లాభాలను బుక్ చేసుకోవడానికి వ్యాపారులను ప్రేరేపించాయి.

ఆదివారం బంగారం ధ‌ర‌లు త‌గ్గిన‌ప్ప‌టికీ, మ‌రో వారంలో బంగారం ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంది. వచ్చే వారం అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాల కారణంగా ఇది జరుగుతుందని భావిస్తున్నారు. డిసెంబర్ 17-18 తేదీల్లో జరిగే US ఫెడ్ సమావేశంలో 0.25% రేటు తగ్గింపుకు 97% అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News