Gold Rate Today: మహిళలకు శుభవార్త..బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ రోజు మంగళవారం బంగారం ధర భారీగా కుప్పకూలింది. నేటి ధరలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
బంగారం అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా బంగారం అంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. మెడలో బంగారం ఉంటే చాలు ఆనందంతో మురిసిపోతుంటారు. అందుకే బంగారానికి మహిళలకు దగ్గరి బంధం ఉంటుంది. మన దేశంలో బంగారంను ఆభరణంగానే కాదు పెట్టుబడిగా కూడా భావిస్తుంటారు. ఏదైనా అత్యవసర సమయంలో బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటారు. అందుకే బంగారం అనేది పెట్టుబడి వస్తువుగా మారిపోయింది. డబ్బులు ఉంటే బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అంతేకాదు దీన్ని ఒక స్టేటస్ సింబల్ గానూ చూస్తుంటారు.
అయితే ఈ మధ్యకాలంలో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఒకసమయంలో ఆల్ టైం గరిష్ట 84వేలకు చేరుకున్న బంగారం ధర నెమ్మదిగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. డిసెంబర్ 10వ తేదీ హైదరాబాద్ లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,639 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,169రూపాయలు పలుకుతోంది. వెండి కిలో ధర రూ, 1,03,300గా ఉంది.
నవంబర్ నెలలో భారీగా పెరిగిన బంగారం ధర ఇప్పుడు రూ. 77వేలకు వచ్చేసింది. గత నెలతో పోల్చి చూస్తే అది చాలా తక్కువ అని చెప్పాలి. నెల రోజుల వ్యవధిలో దాదాపు 7వేలు తగ్గింది. ఇది మామూలు విషయం కాదనే చెప్పాలి. అందుకే బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. అంతర్జాతీయంగా నెలకున్న పరిణామాలే బంగారం ధరలు తగ్గడానికి కారణం అవుతున్నాయని చెప్పవచ్చు.