PAN Card: పాన్ కార్డు హోల్డర్లకు అలర్ట్.. రూ. 10 వేలు ఫైన్ పడుతుంది తస్మాత్ జాగ్రత్త..!

Pan Card: ప్రభుత్వం ఇటీవలే ఆదాయపు పన్ను శాఖ పాన్ 2.0 స్కీమ్‌ను ఆమోదించింది. పాన్, టాన్‌ల జారీ, నిర్వహణను క్రమబద్ధీకరించడం, ఆధునీకరించడమే దీని లక్ష్యం.

Update: 2024-12-09 06:17 GMT

..!PAN Card: పాన్ కార్డు హోల్డర్లకు అలర్ట్.. రూ. 10 వేలు ఫైన్ పడుతుంది తస్మాత్ జాగ్రత్త..!

Pan Card: ప్రభుత్వం ఇటీవలే ఆదాయపు పన్ను శాఖ పాన్ 2.0 స్కీమ్‌ను ఆమోదించింది. పాన్, టాన్‌ల జారీ, నిర్వహణను క్రమబద్ధీకరించడం, ఆధునీకరించడమే దీని లక్ష్యం. పాన్ 2.0లో డూప్లికేట్ పాన్ కార్డ్‌లను తొలగించడం, మోసాలను నిరోధించడం కూడా ఉంది. ఇటీవలి కాలంలో పాన్ కార్డుల ద్వారా జరిగే మోసం సంఘటనలు వేగంగా పెరిగాయి. పాన్ 2.0 ద్వారా అన్ని లూప్ హోల్స్‌ను తొలగించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉంటే, డూప్లికేట్ పాన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అన్నింటికంటే, డూప్లికేట్ పాన్ కార్డ్ అంటే ఏమిటి .. ఎవరైనా దానిని కలిగి ఉంటే వారు రూ.10000 ఎందుకు జరిమానా చెల్లించాలనే సంగతులు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డ్ కలిగి ఉండటం తప్పు

ప్రస్తుతం పాన్‌ కార్డ్‌ అనేది అందరికీ తప్పనిసరి అయింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆదాయపు శాఖ ఇస్తున్న పాన్ కార్డులను పొందుతున్నారు. బ్యాంకు సేవలు మొదలుకొని షాపింగ్, ప్రభుత్వ పథకాల కోసం పాన్ కార్డులు ఉపయోగపడుతున్నాయి. ఆదాయపు పన్ను చట్టం, 1961 నిబంధనల ప్రకారం, ఏ వ్యక్తి ఒకటి కంపే ఎక్కువ పార్ కార్డులను కలిగి ఉండకూడదు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్‌లను కలిగి ఉంటే దానిని జురిస్డిక్షనల్ అసెస్సింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావాలి. అదనపు పాన్‌ను డియాక్టివేట్ చేయాలి. ఆ వ్యక్తి దీన్ని పూర్తి చేయకపోతే, శాఖ దృష్టికి వస్తే, అతను జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పాన్ కార్డు 2.0 ద్వారా డూప్లికేట్ పాన్‌ను గుర్తించేందుకు మెరుగైన సాంకేతికతను ఉపయోగించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డు కలిగి ఉన్న వ్యక్తి సంభావ్యతను తగ్గిస్తుంది. అంటే డూప్లికేట్ పాన్‌ను పూర్తిగా తొలగించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

డూప్లికేట్ పాన్ కార్డ్ సరెండర్ చేయకపోతే ఏమవుతుంది?

ఎవరైనా డూప్లికేట్ పాన్‌ని కలిగి ఉండి, దానిని సరెండర్ చేయకపోతే, ఆదాయపు పన్ను శాఖ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272B కింద రూ. 10,000 వరకు జరిమానా విధించవచ్చు. పాన్ కార్డ్‌ ఆన్‌లైన్ అప్లికేషన్ నిమిత్తం భారత ప్రభుత్వం రెండు ప్రధాన ఏజెన్సీలకు అధికారం ఇచ్చింది. అవి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL), UTI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ (UTIITSL). వీటి అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి కొత్త పాన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. ఈ పాన్ సర్వీస్ ప్రొవైడర్ల వద్ద మీ నకిలీ పాన్ కార్డ్‌ని సరెండర్ చేయడానికి అవసరమైన ఫారమ్‌లను ఫైల్ చేయవచ్చు. అయితే డూప్లికేట్ పాన్ కార్డ్‌ను సరెండర్ చేసే ముందు, మీ చెల్లుబాటు అయ్యే పాన్‌ని ఆధార్‌తో లింక్ చేయడం, బ్యాంక్ ఖాతాలు, పెట్టుబడులు, పన్ను ఫైలింగ్‌లతో సహా అన్ని ఆర్థిక రికార్డులలో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

Tags:    

Similar News