Gold Rate Today: ఆకాశానికి బంగారం ధర..నేడు రూ. 82వేలు..తెలుగు రాష్ట్రాల్లో తాజా ధరలివే
Gold Rate Today: బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్నంటాయి. ఉన్నట్టుండి భారీగా పెరిగింది. గత కొన్నాళ్లుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర నేడు ఒక్కసారిగా భారీగా పెరిగింది. ఈ వారం మొదట్నుంచీ బంగారం ధర పెరుగుతూ వస్తోంది. దీంతో చాలా మంది సంక్రాంతి, క్రిస్మస్, న్యూఇయర్ షాపింగ్ చేద్దామనుకునేవారికి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఎలా ఉందో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధర మంగళవారంతో పోల్చితే 100గ్రాములకు ఏకంగా రూ. 7,500 భారీగా పెరిగింది. దీంతో దేశంలోని పలు నగరాల్లో బంగారం ధర రిటైల్ విక్రయా ధరలను పరిశీలిస్తే గ్రాముకు చెన్నైలో రూ. 7205 పెరిగింది. హైదరాబాద్ లో రూ. 7205 ఉండగా దేశంలో పలు ప్రాంతాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
24క్యారెట్ల బంగారం ధర మంగళవారంతో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ. 8,200భారిగా పెరిగింది. దీంతో దేశంలోని పలు నగరాల్లో పెరిగిన బంగారం రిటైల్ ధరలను పరిశీలించినట్లయితే గ్రాముకు హైదరాబాద్ లో 7860గా ఉంది. మిగతా నగరాల్లోనే ఇవే ధరలు పలుకుతున్నాయి. దేశంలో వరుసగా పండగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతికి కోసం చాలా మంది ఇప్పటి నుంచే బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఈ సమయంలో బంగారం ధర ఇలా భారీగా పెరగడం పసిడి ప్రియుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.