Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే
Gold Rate Today: బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. డిసెంబర్ 9వ తేదీ సోమవారం బంగారం 10 గ్రాములకు దాదాపు రూ. 600 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 77,649 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,179 పలుకుతోంది. బంగారం ధరలు గత కొంతకాలంగా తగ్గుతున్నాయి. దీనికి గల కారణాలేంటో చూద్దాం.
బంగారం ధరలు డిసెంబర్ నెలలో భారీగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా బంగారం ధర గత నెల నవంబర్ నెలలో ఆల్ టైం రికార్డ్ గరిష్ట స్థాయి అయిన 84వేల రూపాయల వరకు వెళ్లింది. అక్కడి నుంచి పోల్చి చూస్తే బంగారం ధర ప్రస్తుతం 77వేల రూపాయల వరకు తగ్గింది. అంటే ఒక నెల రోజుల వ్యవధిలో బంగారం ధర దాదాపు 7వేలు తగ్గింది.
బంగారం ధరలు ప్రధానంగా తగ్గేందుకు కారణం అంతర్జాతీయ పరిణామాలు. ఎందుకంటే అమెరికాలో డాలర్ బలపడే కొద్ది బంగారం ధర తగ్గుతుందని బులియన్ మార్కెట్ల వర్గాలు అంచనా వేస్తున్నాయి. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టనున్న నేపథ్యంలో అక్కడి స్టాక్ మార్కెట్లు బలంగా ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో పెట్టుబడి దారులు తమ పెట్టుబడులను నెమ్మదిగా బంగారం వైపు నుంచి ఉపసంహరించుకుంటున్నారు.
గతంలో బంగారంలో పెట్టుబడి పెట్టేవారు రిస్క్ తక్కువగా ఉంటుందని పెట్టుబడి పెట్టేవారు. కానీ బంగారం కంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఎక్కువ రాబడి వస్తున్న నేపథ్యంలో అటు వైపు పెట్టుబడులు భారీగా తరలివెళ్తుండటంతో బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయి.