PM Kisan Yojana: కొత్త బడ్జెట్‌లో కిసాన్ సమ్మాన్ నిధులు రూ.12000లకు పెంపు.. కేంద్రం ప్లాన్ ఇదే..?

ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ప్రకారం.. పీఎం కిసాన్ యోజన 19వ విడత కొత్త బడ్జెట్‌తో అంటే ఫిబ్రవరి నెలలో విడుదల చేయవచ్చని తెలుస్తోంది.

Update: 2024-12-08 09:00 GMT

PM Kisan Yojana: కొత్త బడ్జెట్‌లో కిసాన్ సమ్మాన్ నిధులు రూ.12000లకు పెంపు.. కేంద్రం ప్లాన్ ఇదే..?

PM Kisan Samman Nidhi Yojana : కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన తదుపరి విడుత డబ్బుల కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం కింద ఇప్పటి వరకు 18 విడతల చొప్పున కోట్లాది మంది చిన్న, సన్నకారు రైతుల ఖాతాలకు నగదు జమ చేశారు. మహారాష్ట్రలోని వాషిమ్ నుంచి 18వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 5న విడుదల చేశారు. 18వ విడత కింద 9.6 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి రూ.20 వేల కోట్లకు పైగా నగదు బదిలీ అయింది. ఇప్పుడు 19వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ప్రకారం.. పీఎం కిసాన్ యోజన 19వ విడత కొత్త బడ్జెట్‌తో అంటే ఫిబ్రవరి నెలలో విడుదల చేయవచ్చని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం దాదాపు 4 నెలలకు ఓ సారి 2000 రూపాయల చొప్పున మూడు విడుతల్లో విడుదల చేస్తుంది. ఫిబ్రవరిలో తదుపరి విడత వచ్చే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఫిబ్రవరి 1న సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే 19వ విడత విడుదలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.

పరిమితి పెరుగుతుందా?

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు మూడు విడతలుగా ఏటా రూ.6,000 ఇస్తుంది. ఒక్కో విడత రూ.2000 సుమారు నాలుగు నెలల వ్యవధిలో రైతుల ఖాతాలకు జమచేస్తున్నారు. ఈ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచాలన్న డిమాండ్ గత కొంతకాలంగా వినిపిస్తోంది. కానీ, పెంచడంపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రజావేదికలో ఏమీ ప్రకటించలేదు.

అమిత్ షా ప్రకటన

అయితే, ఈ ఏడాది జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని రూ.6000 నుండి రూ.10,000కి పెంచడం గురించి మాట్లాడారు. ఇప్పుడు రాష్ట్రంలో మళ్లీ తమ ప్రభుత్వం ఏర్పడింది. హర్యానా రాబోయే బడ్జెట్‌లో మొత్తాన్ని పెంచే ప్రకటన ఏదైనా వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ, రాష్ట్రంలో పీఎం కిసాన్ మొత్తాన్ని పెంచడంపై కేంద్ర లేదా హర్యానా ప్రభుత్వం ఇంకా ఏమీ స్పష్టంగా చెప్పలేదు.

మొత్తాన్ని పెంచాలని డిమాండ్‌

ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం 2025-26 కేంద్ర బడ్జెట్‌ను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన వివిధ రంగాల ప్రీ-బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. శనివారం జరిగిన ప్రీ-బడ్జెట్ సంప్రదింపుల సమావేశంలో, రైతుల సంస్థ భారతీయ కిసాన్ యూనియన్ (నాన్ పొలిటికల్) కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తాన్ని ఏటా రూ.12000కి రెట్టింపు చేయాలని సూచించింది. దీంతోపాటు పలు డిమాండ్లు, సూచనలను రైతుసంస్థ ఆర్థికమంత్రి ముందుంచింది. అయితే బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాతే ప్రభుత్వం ఏయే సూచనలు, డిమాండ్‌లను నెరవేరుస్తుందనేది స్పష్టమవుతుంది.

Tags:    

Similar News