10000 Note: భారత్‌లో 10 వేల నోటు ఉండేదని తెలుసా.. నిలిపివేతకు అసలు కారణం ఏంటంటే?

10000 Note: మనదేశంలో 1938లోనే రూ.10,000 నోటును విడుదల చేశారని మీకు తెలుసా..? అవును మీరు వింటున్నది నిజమే..?

Update: 2024-12-08 11:00 GMT

10000 Note: భారత్‌లో 10 వేల నోటు ఉండేదని తెలుసా..నిలిపివేతకు అసలు కారణం ఏంటంటే?

10000 Note: మనదేశంలో 1938లోనే రూ.10,000 నోటును విడుదల చేశారని మీకు తెలుసా..? అవును మీరు వింటున్నది నిజమే..? డబ్బుకు విలువ ఇవ్వని కాలంలోనే ఈ నోటును ఆర్బీఐ విడుదల చేసింది. ఆ కాలంలో రూ.10,000 వేల నోటు అంటే మామూలు విషయం కాదు. అయితే కేవలం వ్యాపార రంగానికి అనుబంధంగా ఉన్నవారికి మాత్రమే ఈ నోటు గురించి తెలుసు. సాధారణ ప్రజలకు ఇది అందుబాటులో ఉండేది కాదు. అందుకే దీని గురించి ప్రజలకు అంతగా తెలియదు.

ఇప్పుడు భారతదేశంలో అతి పెద్ద కరెన్సీ ఏది అంటే అందరూ రూ.500 నోటు అంటారు. గతంలో అయితే వెయ్యి, రెండు వేల నోటు ఉండేది. ఆర్‌బీఐ వాటిని రద్దు చేశాక రూ.500 నోటే అతి పెద్ద నోటుగా ఉంది. అయితే దేశంలో 1938లో రూ.10,000 కరెన్సీ నోటును ఆర్బీఐ విడుదల చేసింది. దేశంలో కరెన్సీ వ్యవస్థ ఒక అణా (1/16వ వంతు), రెండు అణాల వంటి నాణాలపై ఆధారపడే సమయంలోనే రూ.10,000 నోటు విడుదల చేయడం విశేషం. రూ.25 పైసలు, 50 పైసలు వంటి చిన్న నాణేలు కూడా 1957 వరకు ప్రవేశపెట్టలేదు.. కానీ రూ.10 వేల నోటు మాత్రం ప్రవేశపెట్టారు. దీనిని ప్రధానంగా వ్యాపారస్తులకు పెద్ద లావాదేవీలను సులభతరం చేయడానికి ఉపయోగించేవారు. అందుకే దీని గురించి సాధారణ ప్రజలకు అంతగా తెలియదు.

రూ.10 వేల నోటు ప్రవేశపెట్టిన ఎనిమిదేళ్ల తర్వాత అంటే 1946 జనవరిలో బ్రిటీష్ ప్రభుత్వం ఈ నోటును ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో హోర్డింగ్, బ్లాక్, మార్కెట్ కార్యకలాపాల పెరుగుదలపై ఆందోళనల మధ్య ఈ రద్దు నిర్ణయం తీసుకున్నారు. అలాంటి అధిక విలువ కలిగిన కరెన్సీని నిలిపివేయడం ఈ సమస్యలను అరికట్టడంలో సహాయపడుతుందని ఈ నోటును రద్దు చేశారు. మొదట ఉపసంహరించుకున్నప్పటికీ రూ.10,000 నోటు 1954లో రూ.5,000 నోటు వంటి ఇతర పెద్ద నోట్లతో పాటు తిరిగి ప్రవేశపెట్టారు. 1978 నాటికి మళ్లీ రూ.5 వేలు, రూ.10 వేల నోట్లు రెండింటిని నిలిపివేశారు. అయితే వీటిని మళ్లీ ప్రవేశపెట్టడంపై చర్చలు జరిగినప్పటికీ తిరస్కరణకు గురయ్యాయి.

Tags:    

Similar News