Financial Deadlines: ఈ ఏడాది పూర్తయ్యే లోపు ఈ పనులు పూర్తి చేయండి..లేదంటే పెనాల్టీ కట్టాల్సిందే

Financial Deadlines: ఈ నెలతో ఈ ఏడాది ముగుస్తుంది. కొత్త ఏడాది ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ముగిసేలోపే చాలా ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోపు అలా చేయనట్లయితే ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

Update: 2024-12-08 13:00 GMT

Financial Deadlines: 2024-24 ఆర్థిక ఏడాదికి మీరు ఐటీఆర్ ను ఫైల్ చేయలేనట్లయితే మీకు డిసెంబర్ 31 వరకు గడువు ఉంది. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించేందుకు గడువు తేదీ డిసెంబర్ 15, మార్చి 15లోగా వంద శాతం అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 45శాతం అడ్వాన్స్ ట్యాక్స్ ను సెప్టెంబర్ 15లోగా, 75శాతం డిసెంబర్ 15లోగా 100శాతం మార్చి 15లోగా డిపాజిట్ చేయాలి.

మీరు మీ ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, పుట్టిన తేదీ లేదా ఫొటోను మార్చాలనుకుంటే మీరు డిసెంబర్ 14 వరకు మై ఆధార్ పోర్టన్ ను సందర్శించి ఫ్రీగా అప్ డేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అప్ డేట్ ను పూర్తి చేయడానికి మీరు ఆధార్ కార్డ్ సెంటర్ కు వెళ్లాలి. అప్ డేట్ కోసం మీరు అక్కడ ఫీజు చెల్లించాలి.

మీ రిటర్న్‌ని ఇలా పూర్తి చేయండి:

*మీరు ఇంకా రిటర్న్‌ను ఫైల్ చేయకుంటే, ఆలస్యం అయిన ఐటీఆర్‌ను ఫైల్ చేయడానికి ముందుగా ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి వెళ్లండి.

*పాన్ ఉపయోగించి ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ చేయండి.

*దీని తర్వాత మీ ఆదాయ వనరుల ప్రకారం తగిన ITR ఫారమ్‌ను ఎంచుకోండి.

*FY 2023-24 కోసం 2024-25 అసెస్‌మెంట్ ఇయర్‌ని ఎంచుకోండి.

*వివరాలను పూరించండి: మీ ఆదాయం, పన్ను మినహాయింపు, పన్నుకు సంబంధించి సమాచారాన్ని పూరించండి. వడ్డీ , పెనాల్టీలతో సహా ఏదైనా బకాయి పన్ను చెల్లించండి.

*రిటర్న్‌లను సమర్పించండి: ఆధార్ OTP, నెట్ బ్యాంకింగ్ లేదా ఫిజికల్ వెరిఫికేషన్ ద్వారా రిటర్న్‌లను వెరిఫై చేయండి.

Tags:    

Similar News