PM Kisan: ప్రభుత్వం రైతులకు ఒకేసారి 3శుభవార్తలు.. 2025లో మోదీ సర్కార్ ప్లాన్ ఇదే..!

PM Kisan: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన నుండి వచ్చే డబ్బు కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Update: 2024-12-13 07:29 GMT

PM Kisan: ప్రభుత్వం రైతులకు ఒకేసారి 3శుభవార్తలు.. 2025లో మోదీ సర్కార్ ప్లాన్ ఇదే..!

PM Kisan: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన నుండి వచ్చే డబ్బు కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం కింద ఇప్పటి వరకు 18 విడతలుగా కోట్లాది చిన్న, సన్నకారు రైతుల ఖాతాల్లో నగదు జమ చేయబడింది. మహారాష్ట్రలోని వాషిమ్ నుంచి 18వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 5న విడుదల చేయగా.. 18వ విడత కింద రూ. 9.6 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలకు 20 వేల కోట్ల నగదు బదిలీ అయింది. ఇప్పుడు 19వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ప్రకారం.. పీఎం కిసాన్ యోజన 19వ విడత కొత్త బడ్జెట్‌తో అంటే ఫిబ్రవరి నెలలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా ప్రతి 4 నెలలకు ఒకసారి 2000లను విడుదల చేస్తుంది. తదుపరి విడత ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఫిబ్రవరి 1న సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే.అయితే 19వ విడత విడుదలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.

పీఎం కిసాన్ 19వ విడుత డబ్బు కొత్త సంవత్సర కానుకగా జనవరి నెల రెండో వారంలో రిలీజ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తాజాగా మరో కీలక సమాచారం బయటకొచ్చింది. 2025 లో ఈ స్కీం విషయంలో కేంద్రం బిగ్ ప్లాన్ వేసిందని సమాచారం. సంవత్సరంలో ఇచ్చే మూడు విడతల్లో ఏ మాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నారట. డిసెంబర్- మార్చి, ఏప్రిల్- జులై, ఆగస్టు- నవంబర్.. ఇకపై ఈ మూడు విడతల్లోని ఆరంభ నెలల్లో అంటే డిసెంబర్, ఏప్రిల్, ఆగస్టు నెలల్లోనే రైతులకు పీఎం కిసాన్ డబ్బు జమ చేసేలా సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. మేరకు అధికారులను రెడీ చేస్తోందట ప్రభుత్వం.

పీఎం కిసాన్ 18వ విడతలో 2 వేల రూపాయలు అందుకోని రైతులకు ఆ డబ్బును 19వ విడతతో కలిపి జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. అంటే 18వ విడత, 19 విడత కలిపి మొత్తం రూ. 4 వేలు రైతుల ఖాతాల్లో పడనున్నాయి. ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దని ప్రభుత్వం చెబుతోంది. పీఎం కిసాన్ స్కీం ప్రయోజనాలను పొందాలంటే రైతులు తప్పనిసరిగా చేయాల్సిన పని KYC అప్ డేట్. ఇందుకోసం పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌ pmkisan.gov.in లోకి వెళ్లి మీ ఆధార్ నంబర్, ఫోన్ నంబర్‌, భూమికి సంబంధించిన వివరాలతో PM Kisan E- KYC పూర్తి చేయాల్సి ఉంటుంది.

Tags:    

Similar News