ఫ్రిజ్‌ పేలుడు వెనుక..?

తీవ్ర సంచలనం సృష్టించిన ఫ్రిజ్‌ పేలుడు ఘటన.. ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. నిజంగా ఫ్రిజ్‌ పేలుతుందా..? ఆ పేలుడు ధాటికి మనిషి చనిపోయే ప్రమాదం ఉందా..? మరి బొంగులూరు ఘటనలో ఫ్రిజ్‌లోనే పేలుడు సంభవించిందా..? ఫ్రిజ్‌ పేలుడు వెనుక కారణాలేంటి..?

Update: 2018-12-29 05:23 GMT
Deepika

తీవ్ర సంచలనం సృష్టించిన ఫ్రిజ్‌ పేలుడు ఘటన.. ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. నిజంగా ఫ్రిజ్‌ పేలుతుందా..? ఆ పేలుడు ధాటికి మనిషి చనిపోయే ప్రమాదం ఉందా..? మరి బొంగులూరు ఘటనలో ఫ్రిజ్‌లోనే పేలుడు సంభవించిందా..? ఫ్రిజ్‌ పేలుడు వెనుక కారణాలేంటి..?

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఫ్రిజ్‌ పేలిన ఘటన ఎన్నో సందేహాలను తెరపైకి తీసుకొచ్చింది. బొంగులూరు గ్రామపంచాయతీలోని మై హోమ్స్‌ కాలనీలో కొప్పు మనోహర్, లావణ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. అందులో బీ టెక్‌ చదువుతున్న దీపిక అనే అమ్మాయి ఫ్రిజ్‌ పేలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వాటర్‌ బాటిల్‌ తీసుకునేందుకు దీపిక ఫ్రిజ్‌ డోర్‌ తెరిచింది. అంతే ఫ్రిజ్‌ సిలిండర్‌ ఒక్కసారిగా పేలిపోయింది. డోర్‌ తీసిన దీపిక ఎగిరిపడిపోయింది. ఫ్రిజ్‌ డోర్‌ ఎదురుగా ఉన్న గోడకు కొట్టుకుంది. పేలుడు ధాటికి మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటలకు దీపిక నిలువునా కాలిపోయింది. సజీవదహనం అయిపోయింది.

వాయిస్ : అయితే ఫ్రిజ్‌ పేలుతుందా..? పేలుడుకు సహకరించే పదార్థాలు ఫ్రిజ్‌లో ఉంటాయా..? మరిన్నాళ్లు ఒక్కసారి కూడా ఫ్రిజ్‌ పేలిన ధాఖలాలు కనబడకపోవడానికి కారణాలేంటి..? ఒకవేళ పేలినా ఆ పేలుడు ధాటికి మనిషి చనిపోయే ప్రభావం ఉంటుందా..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు హెచ్‌ఎం టీవీ ప్రయత్నించింది. తొలుత ఫ్రిజ్‌ పేలే అవకాశం ఉందా అని మెకానిక్‌ను సంప్రదించినప్పుడు చాలా అరుదుగా జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫ్రిజ్‌ పేలే అవకాశం ఒకటి రెండు శాతం మాత్రమే అని స్పష్టం చేస్తున్నారు.

అయితే నిపుణులు మాత్రం ఫ్రిజ్‌లు పేలే అవకాశమే లేదంటున్నారు. రిఫ్రిజిరేటర్స్ పేలడం అనేది జరగదని స్పష్టం చేస్తున్నారు. అయితే దీపిక మరణానికి కారణమైన ఫ్రిజ్‌ పేలుడును నిపుణులు మరోరకంగా ఉదహరిస్తున్నారు. సాధారణంగా ఫ్రిజ్‌ అనేది కిచెన్‌లో ఉంటుంది. ఎల్‌పీజీ సిలిండర్‌ కూడా వంటగదిలో ఉంటుంది కాబట్టి పేలుడుకు ఈ రెండింటి మధ్య సంబంధం ఉందని చెబుతున్నారు. ఒక్కోసారి సిలిండర్‌లోని ఎల్‌పీజీ గ్యాస్‌ లీకైన సందర్భంలో అది బయట గాలిలోని ఆక్సీజన్‌తో కలుస్తుంది. అదే సమయంలో ఫ్రిజ్‌ డోర్‌ తెరిస్తే దాని లోపలున్న లైట్‌ వెలగడం అప్పటికే గాలిలో ఆక్సీజన్‌తో కలిసిన ఎల్‌పీజీ గ్యాస్‌కు ఫ్రిజ్‌ లోని లైట్‌ స్పార్క్‌ తగలడంతో అప్పుడు మంటలు చెలరేగే అవకాశం ఉందని చెబుతున్నారు.

అయితే నిపుణులు చెబుతున్న విషయాన్ని బట్టి ఫ్రిజ్‌లు వీలైనంత మేర కిచెన్‌లో కాకుండా ఇతర గదుల్లో అమర్చుకోవడం ఉత్తమం అని తెలుస్తోంది. అలా వీలుకాకపోతే ఫ్రిజ్‌, సిలిండర్‌ ఒకే గదిలో లేకపోయినా పర్వాలేదంటున్నారు. సో ఇకనైనా మీ ఫ్రిజ్‌లు వంటగదిలో ఉంటే వెంటనే దాన్ని ఇతర ప్రదేశాల్లోకి తరలించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Similar News