పశ్చిమబంగాలో మరోసారి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. జాగ్రాం జిల్లాలో శనివారం రాత్రి బీజేపీ కార్యకర్త రమిన్ సింగ్ హత్యకు గురయ్యారు. అయితే ఇది అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పనే అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ కార్యకర్త మృతితో స్థానికంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆరో దశ ఎన్నికల్లో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు దిగారు. అటు ఈస్ట్ మిడ్నాపూర్‌లోని భగబన్‌పూర్‌లో అనంత గుచైటీ, రంజిత్ మైటీ అనే ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై రాత్రి కాల్పులు జరిగాయి. తీవ్రంగా గాయపడిన వారిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అయితే బీజేపీ చేసిన ఆరోపణలను తృణముల్ కొట్టిపారేసింది. మరో వైపు పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన బీజేపీ అభ్యర్థి భారతీ ఘోష్ వాహనంపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భారతీ ఘోష్ భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆదివారం బెంగాల్‌లోని 8 లోక్‌సభ స్ధానాల్లో పోలింగ్ జరుగుతోంది.బీజేపీ కార్యకర్త హత్య