Suchir Balaji: ఆత్మహత్య చేసుకొన్నట్టు లేదు... ఎలాన్ మస్క్

సుచిర్ బాలాజీ (Suchir Balaji) మరణంపై ఎలాన్ మస్క్ అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్యలా అనిపించడం లేదని ఆయన అన్నారు.

Update: 2024-12-30 05:49 GMT

Suchir Balaji: ఆత్మహత్య చేసుకొన్నట్టు లేదు... ఎలాన్ మస్క్

సుచిర్ బాలాజీ (Suchir Balaji) మరణంపై ఎలాన్ మస్క్ అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్యలా అనిపించడం లేదని ఆయన అన్నారు. ఈ ఏడాది నవంబర్ 26న సుచిర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు నిర్ధారించారు.అయితే దీనిపై సుచిర్ తల్లి అనుమానం వ్యక్తం చేశారు.దీనికి సంబంధించి ఆమె సోషల్ మీడియా పెట్టిన పోస్టుకు మస్క్ స్పందించారు.

సుచిర్ తల్లి అనుమానాలు ఇవీ...

సుచిర్ మరణానికి సంబంధించి ఆయన తల్లి పూర్ణిమారావ్ సోషల్ మీడియాలో స్పందించారు. ప్రైవేట్ ఇన్వేస్టిగేటర్ ను నియమించుకొని పోస్టుమార్టం నిర్వహిస్తే పోలీసులు చెప్పిన దానికి భిన్నంగా రిపోర్టు ఉందని ఆమె తెలిపారు.

సుచిర్ ను ఎవరో కొట్టి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.బాత్ రూమ్ లో రక్తం ఆనవాళ్లున్నాయని ఆమె తన పోస్టులో తెలిపారు. సుచిర్ ను హత్య చేసి ఉంటారని ఆమె అనుమానించారు.సుచిర్ మరణంపై ఎఫ్ బీ ఐ(FBI)తో విచారణ జరిపించాలని కోరారు. ఈ పోస్ట్ ను భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి, (vivek ramaswamy)భారత విదేశాంగ శాఖకు ట్యాగ్ చేశారు.

ఓపెన్ ఏఐపై సుచిర్ బాలాజీ ఆరోపణలు

సుచిర్ బాలాజీ ఓపెన్ ఏఐ (open AI)లో నాలుగేళ్లు పనిచేశారు. ఈ ఏడాది ఆగస్టులో బాలాజీ ఓపెన్ ఐఏను వీడారు. తాను ఏఐను వీడడానికి కారణం తెలిస్తే ఎవరూ తట్టుకోలేరని చనిపోవడానికి కొన్ని రోజుల ముందు న్యూయార్క్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. డేటా కలెక్షన్ల కోసం ఓపెన్ ఏఐ అనుసరిస్తున్న విధానాలను ఆయన తప్పుబట్టారు.

ఓపెన్ ఏఐ అమెరికా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని కూడా ఆయన ఆరోపించారు. సుచిర్ మరణించడానికి ఒక్క రోజు ముందే ఓపెన్ ఏఐ కంపెనీకి వ్యతిరేకంగా కాపీరైట్ కేసు నమోదైంది. చాట్ జీపీటీని ప్రారంభించిన సమయంలో జర్నలిస్టులు, రచయితలు, ప్రోగామర్లు ఓపెన్ ఏఐపై న్యాయపోరాటం చేశారు.


Tags:    

Similar News