వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం

Update: 2019-07-28 14:26 GMT

రానున్న రోజుల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఆవరించిన ఉన్న ఉపరితల ఆవర్తనంతో.. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్లు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు రోజుల పాటు.. తెలంగాణ వ్యాప్తంగా, ఏపీలో పలు ప్రాంతాల్లో కూడా తేలికపాటి చినుకులతో పాటు.. పలు చోట్ల మోస్తరు వర్షాలు పడుతాయని అధికారులు వివరించారు. ఇటు తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. పెద్దపల్లి, గోదావరిఖనిలో.. ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది. అలాగే మిగతా జిల్లాల్లో రాత్రి వరకు.. వర్షాలు పడుతూనే ఉన్నాయి.  

Tags:    

Similar News