Bear Attack:500 ఎలుగుబంట్లను చంపేందుకు ప్రభుత్వం నిర్ణయం

Bear Attack:19ఏండ్ల తర్వాత 500ఎలుగుబంట్లను చంపేందుకు రొమేనియా పార్లమెంట్ ఆమోదం తెలిపింది.

Update: 2024-07-16 00:18 GMT

Bear Attack : 500 ఎలుగుబంట్లను చంపేందుకు ప్రభుత్వం నిర్ణయం

Bear Attack:రొమేనియాలో కొన్నేండ్లుగా ఎలుగుబంట్ల భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ మధ్య ఓ యువకుడిపై దాడి చేసి హతమార్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో అక్కడి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 500 ఎలుగుబంట్లను హతమార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు రొమేనియా పార్లమెంట్ కూడా ఆమోదం తెలిపింది.

రొమేనియా పర్యావరణ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో దాదాపు 8వేల ఎలుగుబట్లు ఉన్నాయి. అయితే కొన్నేళ్లుగా వీటి దాడులు ఎక్కువయ్యాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలయ్యింది. గత 20ఏండ్లలో 26మంది మరణించారు. 274మంది తీవ్రంగా గాయపడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా ఓ పర్వతారోహకుడిపై దాడి చేయడంతో అతను మరణించాడు.

దీంతో చర్యలకు ఉపక్రమించిన సర్కరార్..పార్లమెంట్ ను అత్యవసరంగా సమాశపరిచింది. ఇలాంటి దాడులకు వాటి ఎలుగుబంట్ల జనాభా గణనీయంగా పెరగడమే కారణమని చట్టసభ సభ్యుల వాదించారు. భవిష్యత్తులో ఇలాంటి దాడుల కట్టడి చర్యల్లో భాగంగా ఈ ఏడాది 481 ఎలుగుబంట్లను చంపాలని ప్రతిపాదనను పార్లమెంట్ ఆమోదం తెలిపింది. గతేడాది 220 ఎలుగుబంట్లను చంపారు. ఈ సారి ఆ సంఖ్యను రెట్టింపు కంటే ఎక్కువగా చేయడం గమనార్హం. ఈ చర్యను మాత్రం పర్యావరణ సంఘాలు ఖండిస్తున్నాయి. 

Tags:    

Similar News