డోనాల్డ్ ట్రంప్‌ను నేరస్థుడిగా ప్రకటించాలి... కోర్టును కోరిన ప్రాసిక్యూటర్లు
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను దోషిగా నిర్ధారించాలని ప్రాసిక్యూటర్లు న్యాయమూర్తులను అభ్యర్ధించారు. ఇరుపక్షాల వాదనలు మంగళవారంనాడు ముగిశాయి.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను దోషిగా నిర్ధారించాలని ప్రాసిక్యూటర్లు న్యాయమూర్తులను అభ్యర్ధించారు. ఇరుపక్షాల వాదనలు మంగళవారంనాడు ముగిశాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఆరు నెలల ముందు ట్రంప్ ఈ కేసును ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మరోసారి పోటీకి సిద్దమయ్యారు.
పోర్న్ స్టార్ స్టోర్మీ డేనియల్స్ కు 1,30,000 డాలర్లు చెల్లించడానికి ట్రంప్ తన వ్యాపార రికార్డులను తప్పుగా చూపించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2016 అధ‌్యక్ష ఎన్నికల సమయంలో స్టార్మీ డేనియల్స్ తో ఒప్పందం మేరకు ఆమెకు 1,30,000 డాలర్లను ట్రంప్ లాయర్ మైఖేల్ కోహెన్ చెల్లించారు. ఈ ఒప్పందంపై ఆయన సంతకం చేశారు.
ట్రంప్ పై మోపిన ఆరోపణలు అవాస్తవాలని ఇప్పుడు ట్రంప్ తరఫున వాదిస్తున్న లాయర్ టాడ్ బ్లాంచ్ కోర్టును కోరారు.
మరోవైపు, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటార్నీ జోషువా స్టెంగ్లాస్ ట్రంప్ ను దోషిగా ప్రకటించాలని కోర్టును కోరారు. అయితే, ట్రంప్‌కు మోసం చేయాలనే ఉద్దేశ్యం ఉందని చెప్పలేమని న్యాయవాది అన్నారు. ట్రంప్ ఏ తప్పూ చేయలేదని, ఆయనను నిర్ధోషిగా ప్రకటించాలని జ్యూరీని కోరారు.
అయితే, ఈ విచారణ బోరింగ్‌గా ఉందని ట్రంప్ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు ఉదయం ఈ వ్యాఖ్యలు చేస్తూ ఇవాళ అమెరికాకు డేంజరస్ డే అని చెప్పారు.
ఈ కేసులో ట్రంప్ దోషిగా తేలితే నాలుగేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయినప్పటికీ ఈ ఏడాది నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయనకు ఎలాంటి అడ్డంకులుండవు.