Titanic Submarine: మునిగిపోయిన వాళ్ల కోసం వెళ్లి.. వీళ్లు కూడా మునిగిపోయారు..!
Titanic Submarine: కల్పితాలకన్నా వాస్తవాలే భయంకరంగా ఉంటాయి. సినిమాల కన్నా నిజ జీవిత కథలే భయపెడుతుంటాయి.
Titanic Submarine: కల్పితాలకన్నా వాస్తవాలే భయంకరంగా ఉంటాయి. సినిమాల కన్నా నిజ జీవిత కథలే భయపెడుతుంటాయి. టైటానిక్.. అందరికీ తెలిసిన సినిమా. అందరికీ తెలిసిన కథ. ఎవర్గ్రీన్ రియల్ స్టోరీ. 1912లో సముద్రంలో మునిగిపోయింది ఆ పెద్ద నౌక. అయితే దాని శకలాలు వెతుకుదాం అని, దాని ఆచూకీ తీద్దాం అని ఒక ఐదుగురు ఔత్సాహికులు సముద్రంలోకి వెళ్లారు. ఒక చిన్న జలాంతర్గామిలో సముద్రం మధ్యలోకి వెళ్లారు. వద్దు వెళ్లొద్దు అని చాలామంది చెప్పినా వాళ్లు వినలేదు. దానికోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మొండిగా వెళ్ళిపోయారు. కానీ విషాదమేంటంటే మునిగిపోయిన నౌక ఆచూకీ తెలుసుకోవడానికి వెళ్ళిన వీళ్లు కూడా మునిగిపోయారు.
ఆదివారంనాడు సముద్రంలోకి వెళ్లారు, బుధవారం నాడు ఆ జలాంతర్గామిలో ఏదో ప్రాబ్లం వచ్చి ఒత్తిడి తట్టుకోలేక అది పేలిపోయింది. దాంతో వాళ్లు కూడా ముక్కలు ముక్కలై చనిపోయారు. ఆ అభాగ్యులు ఐదుగురు ఎవరంటే పాకిస్తాన్ బిలియనీర్ షెహజాదా దావూద్, అతని కుమారుడు సులేమాన్, బ్రిటీష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ నేవీ అధికారి పాల్ హెన్నీ, ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్. విషాదం కదా.. అందుకే అంటున్నాను, కల్పితాలకన్నా వాస్తవాలు దారుణంగా ఉంటాయి, సినిమాలకన్నా నిజ జీవిత కథలే ఒళ్ళు జలదరించేలా ఉంటాయి అని. పాపం... మునిగిపోయిన వాళ్ళ ఆచూకీ కోసం వెళ్ళిన వీళ్లు మునిగిపోయారు.. ఇప్పుడు వీళ్ళ ఆచూకీ కోసం వెతకాల్సి వచ్చింది.. అదే డెస్టినీ అంటే.