గూగుల్ ట్రెండ్స్..అభినందన్‌, సారా అలీఖాన్‌ టాప్

పెరిగిన టెక్నాలజీ ప్రకారం ఎవరికైనా ఏదైనా సమాచారం కావాలంటే గూగుల్ లో వెతికి సమాచారాన్ని సేకరిస్తారు.

Update: 2019-12-12 06:33 GMT
భారత వైమానిక దళ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌, బాలీవుడ్‌ హీరోయిన్‌ సారా అలీఖాన్‌

పెరిగిన టెక్నాలజీ ప్రకారం ఎవరికైనా ఏదైనా సమాచారం కావాలంటే గూగుల్ లో వెతికి సమాచారాన్ని సేకరిస్తారు. ఒక సంఘటన గురించి కానీ, ఒక వ్యక్తి గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే గూగుల్ లో సెర్చ్ చేస్తే చాలు అనుకున్న సమాచారం అందుతుంది. దీంతో ప్రతి ఒక్కరూ వ్యయప్రయాసలు పడకుండా సమాచారాన్ని సేకరించొచ్చు.

ఇదే కోణంలో పాకిస్తాన్ దేశస్తులు ఈ ఏడాది ఏ విషయానికి సంబంధించిన వివరాల కోసం ఎక్కువగా గూగుల్లో వెతికారు అన్న జాబితాను విడుదల చేసారు.ఇందులో భాగంగానే పాకిస్తానీయులు గూగుల్‌లో అత్యధికంగా వెదికిన వ్యక్తుల జాబితాలో భారత వైమానిక దళ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌, బాలీవుడ్‌ హీరోయిన్‌ సారా అలీఖాన్‌లు టాప్‌-10లో నిలిచారన్న విషయాన్ని సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం తెలియజేసింది.

భారత దేశంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్‌ స్ట్రైక్స్‌ సంచలనాన్ని సృష్టించింది. ఈ నేపథ్యంలోనే ఐఏఎఫ్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పాక్‌ విమానాన్ని వెంబడిస్తూ అక్కడి భూభాగంలో దిగారు. దీంతో పాకిస్తాన్ సైనికులు అభినందన్ ను బంధించారు. ఆ తర్వాత అతనిని విడుదల చేయాలా, వద్దా అన్న విషయాలపైన చాలా చర్చలు జరిపించారు. అనంతరం ఈ సంఘటనపై జెనీవా చేసిన ఒప్పందం ప్రకారం ఆయనను పాక్ సైన్యం విడుదల చేసి భారత్ కు పంపించారు.

భారత దేశానికి దాయాది దేశమై పాక్ ఎన్ని చిత్రహింసలకు గురిచేసినా అతను మాత్రం మాతృభూమి రహస్యాలను, దానికి సంబంధించిన సమాచారాన్ని బయటికి చెప్పలేదు. దీంతో ఆ‍యన గురించి పాక్‌ మీడియాలోనే ధైర్యసాహసాలు ప్రదర్శించిన వ్యక్తి అని వరుస కథనాలు ప్రసారం చేసారు. అంతే కాదు ఆయన గురించి సోషల్‌ మీడియాలో కూడా చాలా చర్చలు జరిగాయి. దాయాది దేశంలోకి ప్రవేశించి ప్రాణాలతో బయటపడిన అభినందన్ ను భారతదేశానికి రియల్ హీరోగా చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోలను, సమాచారాన్ని పాక్ దేశస్తులు ఎక్కువగా గూగుల్‌లో వెదికారు.

దాంతో పాటు బాలివుడ్ లో కేదార్‌నాథ్‌ సినిమాతో ఫేమ్ అయిన సారా అలీఖాన్ గురించి కూడా గూగుల్ లో సెర్చ్ చేసినట్టు టాప్ టెన్ జాబితాలో వెలువడింది. ఈ సుందరి పటౌడీ వంశ వారసురాలు, బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ కూతురు. ఆమె సినిమాల్లోనే కాదు వివిధ కార్యక్రమాల్లో కూడా తనదైన శైలిలో పార్టిసిపేట్ చేసి అందరినీ ఆకట్టుకుంది. తన కట్టూబొట్టుతో, అందం అభినయంతో ఫ్యాషన్‌ ఐకాన్‌గా నిలిచి యువతలో మంచి ఫాలోయింగ్‌ ని సంపాదించుకున్నారు. అంతే కాకుండా ఇండియన్‌ టీవీ రియాలిటీ షో బిగ్‌బాస్‌- 13, మోటూ పాట్లూ షోపై కూడా వారు అత్యంత ఆసక్తిని కనబరిచారని గూగుల్‌ ఇండియా వెల్లడించింది.  

Tags:    

Similar News