New York: కోర్టులో లొంగిపోనున్న డొనాల్డ్ ట్రంప్.. శృంగార తారతో అనైతిక ఒప్పందం నిర్ధారణ
New York: కోర్టులో లొంగిపోనున్న డొనాల్డ్ ట్రంప్.. శృంగార తారతో అనైతిక ఒప్పందం నిర్ధారణ
New York: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మ్యాన్‌హట్టన్ కోర్టులో లొంగిపోయే అవకాశం ఉందని న్యూయార్క్ పోలీసులు భారీ బందోబస్తు కల్పిస్తున్నారు. రహదారులను బ్లాక్ చేయడంతో పాటు కోర్టులోని ఇతర గదులను కూడా మేసేయనున్నట్టు తెలుస్తోంది. శృంగార తారతో సంబంధం బయటపడకుండా.. ఆమెకు డబ్బు ఇచ్చి మేనేజ్ చేసినట్టు ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలు రుజువయ్యాయి. దీంతో మాజీ అధ్యక్షుడిపై క్రిమినల్ కేసు నమోదయ్యింది. అమెరికా చరిత్రలోనే ఇలా మాజీ అధ్యక్షుడు, ప్రెసిడెంట్ సిట్టింగ్ అభ్యర్థిపై క్రిమినల్ కేసు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ట్రంప్ అరెస్టు ఖాయమైంది. దీంతో తనే స్వయంగా కోర్టు ముందు స్వచ్ఛందంగా లొంగిపోయి విచారణకు హాజరవ్వాలని ట్రంప్ ప్రకటించారు. తాజాగా వీకెండ్ సందర్భంగా ఫ్లోరిడాలోని తన ఎస్టేట్ మార్-ఏ-లాగోలో గోల్ఫ్ ఆడారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అనంతరం సలహాదారులతో సమావేశమయ్యారు.
శృంగార తార స్మార్టీ డేనియల్స్‌తో సంబంధం బహిరంగ పర్చకుండా ఉండేదుకు.. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ఆమెకు డబ్బు ఇచ్చి ట్రంప్ అనైతిక ఒప్పందం కుదుర్చుకున్నారు. తన వ్యక్తిగత లాయర్ ద్వారా ఆమెకు లక్షా 30వేల డాటర్లను ట్రంప్ ముట్టజెప్పారట. అయితే రెండేళ్ల తరువాత... 2018లో ఆమె మీడియా ముందుకు వచ్చింది. ట్రంప్‌తో తనకు శారీరక సంబంధం ఉందని సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఆ తరువాత తమ మధ్య జరిగిన ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ లాస్‌ఏంజెల్స్ కోర్టులో దావా వేసింది. ఆ సమయంలో ట్రంప్ అధ్యక్ష స్థానంలో ఉండడంతో ఈ కేసును హైప్రొఫైల్ కింద భావించి అత్యున్నత దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఈ కేసు విచారణలో ఆరోపణలు రుజువు కావడంతో క్రిమినల్ కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే అమెరికా పోలీసులు ట్రంప్‌ను అరెస్టు చేయనున్నారు.
ట్రంప్ 2006లో రియల్ ఎస్టేట్ టైకూన్‌గా పేర్కొందిన డొనాల్డ్ ట్రంప్.. స్మార్టీ డేనియల్స్‌ను తొలిసారి ఓ గోల్ఫ్ టోర్నమెంట్‌లో కలుసుకున్నారు. ఆ సమయానికి ఆమె వయస్సు 27 ఏళ్లు. అప్పుడు ట్రంప్ వయస్సు 60 ఏళ్లు. అప్పట్లో రాత్రి ఓ పెంట్‌హౌస్‌లో ట్రంప్‌తో గడిపినట్టు తెలిపారు. తనతో కలయికను ట్రంప్ ఎంతగానో పొగిడారని స్మార్టీ డేనియల్స్ తాను ప్రచురించిన ఫుల్ డిస్‌క్లోజర్ అనే పుస్తకంలో వివరించారు. అయితే 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో తనకు ఇచ్చిన మాట తప్పడంతో తమ సంబంధాన్ని బయటపెట్టడానికి స్మార్టీ సిద్ధమైంది. తన లాయర్ ద్వారా ఆమెతో ఒప్పందం చేసుకుని.. డబ్బు ద్వారా ఆమె నోరు మూయించే ప్రయత్నం చేశాడు ట్రంప్.. 2018లో ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఈ విషయాలను స్మార్టీ వెల్లడించింది. మరోవైపు ట్రంప్ ఈ ఆరోపణలను రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. దీన్ని ఎలా ఎదుర్కొనాలో తనకు తెలుసునని వరుసుగా సోషల్ మీడియాలో ట్రంప్ పోస్టులు పెడుతున్నారు.
తాజాగా ట్రంప్ లొంగుబాటు నేపథ్యంలో ఆయన మద్దతుదారులు ఎలాంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడకుండా ముందస్తుగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు న్యూయార్క్ పోలీసులు.. అంతేకాకుండా.. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు తలెత్తకుండా భద్రతను కట్టుదిట్టం చేసే వ్యూహాన్ని సిద్ధం చేశారు. ట్రంప్‌పై నమోదైన క్రిమినల్ కేసును రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ ప్రతినిధి మార్జోరీ టేలర్ గ్రీన్ రాజకీయ కుట్రగా అభివర్ణిస్తోంది. కోర్టుకు సమీపంలో ఉన్న పార్కు వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైనట్టు మార్జోరీ తెలిపారు. న్యాయ వ్యవస్థ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడాన్ని తాము నిరసిస్తామని ఆమె ట్విట్టర్‌లో వెల్లడించారు. అయితే 2021 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడంతో.. ఆయన మద్దతుదారులు వైట్ మౌస్‌పై దాడి చేసి.. హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు.